Mura Movie : ఓటీటీ లో హల్చల్ చేస్తున్న మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా

తాజాగా తెలుగు,తమిళ్‌,కన్నడ వంటి భాషలలో నూ స్ట్రీమింగ్ అవుతోంది...

Mura : ఈ మధ్య కాలంలో మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ‘ముర(Mura)’ ఒకటి. యాక్షన్ రివేంజ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ మాలీవుడ్ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్ట్స్ లెవెల్ లో ఉన్నాయని ప్రశంసలు వినిపించాయి. ముహమ్మద్ ముస్తాఫా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముర(Mura)’ చిత్రంలో హృదు హరూన్, సూరజ్ వెంజరమూడు, మాలా పార్వతి,కన్నన్‌ నాయర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 08న విడుదలైన ఈ సినిమా ఇటీవలే 50 రోజుల వేడుకను కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఐఎండీబీ ఈ మురా సినిమాకు ఏకంగా 7.7 రేటింగ్ ఇవ్వడం విశేషం.

థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన మురా సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20 నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. అయితే అప్పుడు కేవలం మలయాళ వెర్షన్ ను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు . తాజాగా తెలుగు,తమిళ్‌,కన్నడ వంటి భాషలలో నూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శనివారం (డిసెంబర్ 28) అర్ధరాత్రి నుంచే మురా సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

Mura Movie OTT Updates

ఇక మురా సినిమా కథ విషయానికి వస్తే.. కేరళలోని తిరువనంతపురం చుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతూ ఉంటుంది. నలుగురు యువకులు ఉద్యోగం లేకపోవడంతో ఓ దోపిడీ కోసం ప్రయత్నిస్తారు. ఇందుకోసం ఓ రౌడీ గ్యాంగ్ తో చేతులు కలుపుతారు. మరి ఆ తర్వాత వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయన్నదే మురా సినిమా కథ. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ‘ముర’ ఓ మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. పైగా వీకెండ్ కాబట్టి మంచి టైమ్ పాస్ కూడా అవుతుంది.

Also Read : Mahesh Babu : రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో ఆ పాన్ ఇండియా స్టార్ హీరో కూడా..

CinemaMollywoodOTTTrendingUpdatesViral
Comments (0)
Add Comment