Beauty Malavika Mohanan :డార్లింగ్ ఆతిథ్యం మాళ‌విక సంతోషం

రాజా సాబ్ మూవీలో న‌టిస్తున్న న‌టి

Malavika Mohanan : టాలీవుడ్ లో ఆతిథ్యానికి పెట్టింది పేరు డార్లింగ్ ప్ర‌భాస్. త‌ను ప్ర‌స్తుతం రొమాంటిక్ రోల్ లో న‌టిస్తున్నాడు రాజా సాబ్ మూవీలో. ఈ సినిమాకు మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. చిత్రానికి సంబంధించి రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్ కెవ్వు కేక అనేలా ఉన్నాయి. ఇందులో కీల‌క‌మైన పాత్ర‌లో న‌టిస్తోంది మ‌ల‌యాళ కుట్టి మాళ‌విక మోహ‌న్.

Malavika Mohanan Praises

చిట్ చాట్ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌త్యేకించి త‌న జీవితంలో ఎన్న‌డూ ఇలాంటి హీరోను చూడ‌లేదంటూ ప్ర‌భాస్ ను ఉద్దేశించి పేర్కొంది. తాను ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు సినిమాల‌లో న‌టించాన‌ని, ఎంద‌రితో క‌లిసి తెర‌ను పంచుకున్నాన‌ని కానీ డార్లింగ్ ప్ర‌భాస్ లాంటి హీరోను ఎక్క‌డా చూడ‌లేద‌న్నారు.

రాజా సాబ్ మూవీలో సెలెక్టు అవుతాన‌ని క‌ల‌లో కూడా అనుకోలేద‌ని తెలిపింది మాళ‌విక మోహ‌న్(Malavika Mohanan). త‌న‌కు టాలీవుడ్ కొత్త ప‌రిశ్ర‌మ‌. భాష రాదు. ముందుగా భ‌య‌ప‌డ్డా. కానీ రాను రాను ప్ర‌భాస్ తో మాట ముచ్చ‌ట క‌లిపాక వాతావ‌ర‌ణం తేలిక‌గా అనిపించింది. అంతే కాదు హైద‌రాబాద్ బిర్యానీ తిన‌డం అల‌వాటై పోయింద‌ని చెప్పింది.

త‌న పాత్ర రాజా సాబ్ లో సూప‌ర్ గా ఉంటుందని, సినిమా చూశాక మీరే ఆశ్చ‌ర్య పోతార‌ని తెలిపింది. త‌న‌కు అద్బుత‌మైన డైరెక్ట‌ర్ మారుతి రూపంలో దొర‌క‌డం, ప్ర‌భాస్ తో న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు తెలిపింది.

Also Read : Kohli Sensational Victory :స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డ్ స‌మం

CommentsMalavika MohananPrabhasTrendingUpdatesViral
Comments (0)
Add Comment