Malavika Mohanan : మాళవిక నటించిన బాలీవుడ్ సినిమా ‘యుద్ర’ నుంచి హాట్ సాంగ్

అయితే.. సాధార‌ణంగానే మాములుగానే బ‌ట్ట‌ల విష‌యంలో చాలా పొదుపును పాటిస్తూ.....

Malavika Mohanan : మాళ‌వికా మోహ‌న‌న్ ప్ర‌స్త‌తం సౌత్ ఇండియాలో వ‌రుస భారీ సినిమాల‌తో దూసుకెళుతోంది. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేయూ మోహ‌న్ కూతురిగా సినిమా ఇండ‌స్ట్రీలోకి ఓంట్రీ ఇచ్చిన ఈ చిన్న‌ది 2013లో త‌న మొద‌టి సినిమానే దుల్క‌ర్ స‌ల్యాన్ వంటి స్టార్‌తో న‌టించి వార్త‌ల్లో నిలిచింది. ఆ త‌ర్వాత త‌మిళంలో ర‌జ‌నీకాంత్ పేట, విజ‌య్‌ మాస్ట‌ర్, ధ‌నుష్‌ మార‌న్ వంటి పెద్ద సినిమాల‌తో అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవ‌ల వ‌చ్చిన‌ విక్ర‌మ్ తంగ‌లాన్ సినిమాలో ఆర‌తిగా న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం పొందింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రాజాసాబ్ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇవ్వ‌బోతుంది.

ఇదిలా ఉండ‌గా ఈ ముద్దుగుమ్మ దాదాపు 7 సంవ‌త్స‌రాల త‌ర్వాత యుద్ర(Yudhra) అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. గల్లీబాయ్‌, గెహ‌రియాన్ వంటి సినిమాల‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు సిద్ధార్థ్ చ‌తుర్వేది హీరోగా తెర‌కెక్కిన యుద్ర చిత్రంలో మాళ‌విక మోహ‌న‌న్(Malavika Mohanan) క‌థానాయిక‌గా న‌టించింది. సుమారు మూడేండ్ల క్రితం ప్రారంభించిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని సెప్టెంబ‌ర్‌20న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ఈ మూవీ ట్రైల‌ర్‌ను, సాతియా అంటూ సాగే ఓ రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

Malavika Mohanan Song…

అయితే.. సాధార‌ణంగానే మాములుగానే బ‌ట్ట‌ల విష‌యంలో చాలా పొదుపును పాటిస్తూ.. అంత‌కుమించి అనేలా అందాలను ఆర‌బోసే ఈ సొగ‌స‌రి ఈ యుద్ర మూవీలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్ చూస్తే ఈ విష‌యం ఇట్టే అర్ద‌మ‌వుతోంది. అంతేకాదు ఇంటిమేట్ స‌న్నివేశాల‌లోనూ శృతిమించి న‌టించింది. ఈక్ర‌మంలో తాజాగా విడుద‌ల చేసిన సాతియా అంటూ సాగే వీడియో సాంగ్‌లో అమ్మ‌డి గ్లామ‌ర్‌, అందాలు, ముద్దు సీన్లు చూసి ఆమె అభిమానులు, సినీ ల‌వ‌ర్స్ షాక్ అవుతున్నారు. గ‌తంలో ఏ మూవీలోనూ మాళ‌విక‌ను ఇంత ఘాటుగా చూసిందిలేద‌ని, మ‌రి ఇంత‌లా రెచ్చి పోయిందేంటని కామెంట్లు చేస్తున్నారు. ఆ క్లిప్పుల‌ను సోష‌ల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.మీరు ఇంత‌వ‌ర‌కు చూడ‌లేదా ఇప్పుడే చూసి ఎంజాయ్ చేయండి మ‌రి.

Also Read : Kamal Haasan : కమల్ హాసన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి ‘రాధికా’

Malavika MohananSongTrendingUpdatesViral
Comments (0)
Add Comment