Malaika Arora : ఐదు పదుల వయసులోనూ 3 వ సారి ప్రేమలో పడ్డ బాలీవుడ్ భామ

ఈ వార్తలపై అర్జున్, మలైకా ఇద్దరూ స్పందించలేదు...

Malaika Arora : బాలీవుడ్ భామ మలైకా అరోరా ఎప్పుడూ వృత్తిపరంగా కాకుండా, వ్యక్తిగత జీవితం వల్ల వార్తల్లో నిలుస్తుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సల్మాన్ ఖాన్ సొదరుడు అర్భాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు ఉన్నాడు. పెళ్లైన 19 ఏళ్ల తర్వాత తన భర్త అర్బాజ్ ఖాన్‌తో మలైకా విడాకులు తీసుకుంది. ఆ తరువాత హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది. చాలా కాలంపాటు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. ఇద్దరూ కలిసి ప్రైవేట్ ఫంక్షన్స్, పార్టీలలో పాల్గొన్నారు. అదే సమయంలో ఇద్దరి వయసు వ్యత్సాసం గురించి అనేక ట్రోలింగ్స్ జరగ్గా.. తమదైన శైలిలో స్పందించారు. కానీ ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారనే టాక్ నడుస్తుంది. అర్జున్‌తో మలైకా విడిపోయిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

Malaika Arora…

ఈ వార్తలపై అర్జున్, మలైకా ఇద్దరూ స్పందించలేదు. ఈ క్రమంలోనే మలైకా(Malaika Arora) చేసిన ఓ పోస్ట్‌.. ఇప్పుడు ఈ బ్యూటీ ముచ్చటగా మూడో సారి ప్రేమలో పడిందా ఏంటి? అనే డౌట్ తన ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లలో కలిగిస్తోంది. ఎస్ ! ఓవైపు సోషల్ మీడియాలో బ్రేకప్ వదంతులు చక్కర్లు కొడుతుండగా.. ఓ మిస్టరీ మ్యాన్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది మలైకా. దీంతో ఈ బ్యూటీ మూడోసారి ప్రేమలో పడినట్లు ఓ టాక్ బయటికి వచ్చింది. దానికితోడు.. ‘ప్రతి ఆనందం… ప్రేమపూర్వకమైన పదం… ప్రతి చర్య మన ఆత్మ సౌందర్యానికి ప్రతిబింబం.’ అంటూ ఇన్ స్టాలో మలైకా చేసిన పోస్ట్.. ఇప్పుడు ప్రూఫ్‌గా మారింది. పక్కాగా ఈమె ప్రేమలో పడిందనే కామెంట్ సోషల్ మీడియాలో వస్తోంది. అది కాస్త తెగ వైరలవుతోంది.

Also Read : Hyper Aadi : హైపర్ ఆది వల్లే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసానంటున్న నటి

BreakingMalaika AroraUpdatesViral
Comments (0)
Add Comment