Kanguva : తమిళ్ సూపర్ స్టార్ సూర్య నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ(Kanguva)’. భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు శివ రూపొందించారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించగా.. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈరోజు (నవంబర్ 14) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ భారీ అమౌంట్ కి కొనుగోలు చేసింది. స్ట్రీమింగ్ పై కూడా క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది.
Kanguva Movie OTT Updates
రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో సూర్య కెరీర్ లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా ‘కంగువ’ తెరకెక్కింది. ఈ సినిమాని రెండు పార్టులుగా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్’ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని భారీ ప్రైజ్ కి దక్కించుకుంది. ఈ సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాత స్ట్రీమ్ చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని అఫీషయల్ గా ప్రకటించకపోయినా ఇది పక్క సమాచారమని ఇండస్టీ టాక్.ఈ సినిమా రిలీజైన అన్ని చోట్లా నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఫైట్స్, విజువల్స్ అదిరిపోయాయని ఫ్యాన్స్ ట్విటర్‌లో సందడి చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచిందంటున్నారు. మరికొందరు ఇది సూర్య కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు. సినిమాలో ఎన్నో ట్విస్ట్‌లు ఉన్నాయని టాక్.
Also Read : Shruti Haasan : సైలెంట్ కిల్లర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన శృతి హాసన్