Guntur Kaaram : అత్యంత జనాదరణ పొందిన పాటల్లో టాప్ లో నిలిచింది ప్రిన్స్ మహేష్ బాబు, లవ్లీ బ్యూటీ శ్రీలీల నటించిన సాంగ్ కుర్చీ మడత పెట్టి. ఇద్దరూ పోటీ పడి నటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమాలోనిది ఈ సాంగ్. ఏ సినిమాకైనా పాటలు ముఖ్యం. అవే విజయంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఆశించిన మేర ఆడలేదు ఈ మూవీ. కానీ ఇందులోని కుర్చీ మడత పెట్టి సాంగ్ మాత్రం ఇరగ దీసింది.
Super Star – Guntur Kaaram Song
గుంటూరు కారం(Guntur Kaaram) తర్వాత ఎన్నో సినిమాలు వచ్చినా నేటికీ పాటనే నెట్టింట్లో వైరల్ కావడం విశేషం. ఈ మధ్యన విదేశాలలో సైతం స్టెప్పులు వేస్తున్నారు. తెగ ఆనంద పడుతున్నారు. ప్రధానంగా యువతీ యువకులతో పాటు వృద్దులు సైతం కుర్చీ మడత పెట్టి అంటూ డ్యాన్సులతో అదర గొడుతున్నారు.
ఈ సాంగ్ ఫీవర్ కొత్త ఏడాదిని కూడా వదలడం లేదు. దీంతో మూవీ మేకర్స్ విస్తు పోతున్నారు. మిలియన్ల సంఖ్యలో వ్యూస్ తో దూసుకు పోతోంది. యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇదిలా ఉండగా గూగుల్ సంస్థకు చెందిన యూట్యూబ్ కీలక ప్రకటన చేసింది. గత ఏడాదికి గాను అత్యంత జనాదరణ కలిగిన సాంగ్ గా పేర్కొంది. మహేష్ బాబు లుక్స్ , శ్రీలీల డ్యాన్సు కుర్చీ మడత పెట్టి పాటకు ప్రాణం పోసేలా చేశాయి.
Also Read : Hero Varun Tej : ప్రతి నాయకుడిగా వరుణ్ తేజ్