Mahesh Babu : మహేష్ బాబు ఫ్యామిలీలో మరో ఘోర విషాదం

ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు మరణ వార్తను నిర్మాతల మండలి సభ్యులు తెలిపారు...

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది మహేష్ బాబు ఫ్యామిలి ముగ్గురు మరణించారు. అమ్మ, అన్న, నాన్న ఇలా ఒకరితర్వాత ఒకరు మరణించడంతో మహేష్ బాబు మానసికంగా కుంగిపోయారు. ఇప్పుడిప్పుడే మహేష్ ఆ బాధనుంచి కోలుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్(Mahesh Babu) ఫ్యామిలిలో మరో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ బావ, మహేష్ బాబు మావయ్య ప్రముఖ నిర్మాత అయిన ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి కన్నుమూశారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. కోలుకుంటున్నారు అని అనుకునేలోగా ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు మరణించారని తెలుస్తోంది. దాంతో మహేష్ ఫ్యామిలి విషాదం నెలకొంది.

Mahesh Babu..

ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు మరణ వార్తను నిర్మాతల మండలి సభ్యులు తెలిపారు. ఆయన మరణానికి సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అలాగే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. సూర్యనారాయణ బాబు మహేష్ బాబుకు మావయ్య అవుతారు. సూపర్ స్టార్ కృష్ణ సోదరి లక్షీ తులసిని సూర్యనారాయణ బాబు వివాహం చేసుకున్నారు. ఆతర్వాత పద్మావతీ ఫిలింస్ బ్యానర్‌ను స్థాపించి సినిమాలను నిర్మించారు. ఈ బ్యానర్ లో ‘శంఖారావం’, ‘బజార్ రౌడీ’, ‘అల్లుడు దిద్దిన కాపురం’, ‘అన్నదమ్ముల సవాల్’ లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అంతే కాదు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లోనూ సినిమాలను నిర్మించారు సూర్యనారాయణ బాబు. చాలా కాలం సినిమా నిర్మాతగా ఉన్న ఆయన ఆతర్వాత వెళ్లగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. నిర్మాతగానే కాదు రాజకీయం వైపు కూడా అడుగులేశారు సూర్యనారాయణ బాబు. ఏకంగా నందమూరి తారకరామారావు మీద పోటీ చేశారు. 1985లో నందమూరి తారక రామారావుపై గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆతర్వాత మళ్లీ రాజకీయాల వైపు వెళ్ళలేదు ఆయన.

Also Read : Mega Family Olympics : ఒలింపిక్స్ ఫ్లాగ్ ను ప్రదర్శిస్తూ సందడి చేసిన మెగా ఫ్యామిలీ

BreakingMahesh BabuUpdatesViral
Comments (0)
Add Comment