Mahesh Babu: టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ లో ప్రిన్స్ మహేశ్ బాబు- నమ్రతా శిరోద్కర్ జంట ఒకటి. సినిమా రంగంలో ప్రేమించి పెళ్ళి చేసుకుని… చాలా అన్యోన్యంగా ఉంటే జంట కూడా ఇదే. పెళ్ళి తరువాత సినిమాలకు దూరమైన నమ్రత… తన జీవితాన్ని పూర్తిగా కుటుంబానికి అంకితం చేయగా… మహేశ్ బాబు కూడా సాథ్యమైనంత ఎక్కువ సమయం కుటుంబానికి కేటాయిస్తాడు. ఈ నేపథ్యంలో 53వ వసంతంలోనికి అడుగుపెడుతున్న తన భార్య నమ్రతకు… సూపర్ స్టార్(Mahesh Babu) తన సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే ఎన్‌ఎస్‌జీ (NSG) అంటూ… లవ్ సింబల్ జత చేస్తూ ట్వీట్ చేశారు.
నా జీవితంలో ప్రతి రోజును అద్భుతంగా తీర్చిదిద్దుతున్న నువ్వు ఈ ఏడాదిలో మరింత ప్రేమ, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ లో తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన మహేశ్ బాబు అభిమానులు కూడా నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Mahesh Babu Comment
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబోలో తాజాగా విడుదలైన సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ… కలెక్షన్ల పరంగా మహేశ్ బాబు(Mahesh Babu) సత్తాను చాటుతోంది. రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో ఇంకా థియేటర్ల వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు గుంటూరులో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ మహేశ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మీరే నాకు అమ్మా, నాన్న అంటూ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ఇప్పటి నుంచి నాకు మీరే అన్నీ అంటూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్ స్టాలో నమ్రత పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేశ్… రాజమౌళి సినిమా కోసం జర్మనీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : Megastar Chiranjeevi: అయోధ్య ఆహ్వానంపై మెగాస్టార్ భావోద్వేగం !