Mahesh Babu: మహేశ్‌ బాబు కుమారుడి బర్త్‌ డే ! స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన నమ్రత !

మహేశ్‌ బాబు కుమారుడి బర్త్‌ డే ! స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన నమ్రత !

Mahesh Babu : టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌ బాబు… తన కుమారుడు గౌతమ్‌ బర్త్‌ డే వేడులకలను ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ప్రిన్స్‌ ఫ్యామిలీ గౌతమ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. గౌతమ్ తో కలిసి మహేశ్ బాబు, నమ్రత, సితార కలిసి కేక్ కట్ చేసారు. ఈ కేక్ పై 18 అని ఉండటంతో గౌతమ్ 18 వ సంవత్సరంలోనికి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ బర్త్‌ డే వేడుకకు సంబంధించిన ఫోటోలను నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్‌ గౌతమ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Mahesh Babu…

కాగా.. ప్రస్తుతం మహేశ్‌బాబు దర్శకధీరుడు రాజమౌళితో జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ‍అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్‌ అడ్వెంచర్‌గా తెరకెక్కించునున్న ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఇప్పటికే కథను అందించారు. ఈ మూవీ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంగా ఈ మూవీని తెరకెక్కించినున్నట్లు తెలుస్తోంది.

Also Read : Sundeep Kishan : పేద మహిళల సహాయార్థం ముందుకు వచ్చిన హీరో సందీప్ కిషన్

Mahesh BabuNamrata Shirodkar
Comments (0)
Add Comment