Mahesh Babu : టాలీవుడ్ లో అత్యంత జనాదరణ కలిగిన నటుల్లో మహేష్ బాబు(Mahesh Babu) ఒకరు. తను వివాదాలకు దూరంగా ఉంటాడు. సినిమాలు తప్ప వేరే గురించి ఆలోచించడు. షూటింగ్ పూర్తయిందంటే చాలు వెంటనే ఇంటికి వెళ్లి పోతాడు. తన ఫ్యామిలీతో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఏ మాత్రం సమయం చిక్కితే వెంటనే బుక్ చేసుకుని ఫ్లైట్ లో ఇతర ప్రాంతాలను సందర్శిస్తాడు. వీలున్నప్పుడు మంచి పుస్తకాలను చదువుతాడు.
Mahesh Babu Rejects..
ప్రస్తుతం మహేష్ బాబు దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తనతో ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఇతర సాంకేతిక నిపుణులు , ఎవరు నటిస్తున్నారనే దానిపై ఇంకా వెల్లడించలేదు దర్శకుడు జక్కన్న. ఆయన రూటే సపరేట్. దీనిని ఇంటర్నేషనల్ స్థాయిలో పూర్తి అడ్వెంచర్ గా తీయనున్నట్లు సమాచారం.
ఇది పక్కన పెడితే తాజాగా మహేష్ బాబు గురించి ఓ వార్త గుప్పుమంది. ఇటీవలే విడుదలైన ఛావా చిత్రానికి సంబంధించి దర్శకుడు ప్రిన్స్ ను ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ పాత్రను చేయమని సంప్రదించాడని, ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు టాక్.
గతంలో కూడా పలు విజయవంతమైన సినిమాలను వదులుకున్నాడు మహేష్ బాబు. తను త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గుంటూరు కారంలో నటించాడు. అది ఆశించనంతగా ఆడలేదు.
Also Read : Hero Chiranjeevi-Tej మెగాస్టార్ మూవీలో మేనల్లుడు