Mahesh Babu-Rajamouli: రణ్ బీర్ కపూర్… భారత చలన చిత్ర పరిశ్రమలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ నటుడు రిషి కపూర్ వారసుడిగా 2007లో బాలీవుడ్ లో అడుగుపెట్టిన రణ్ బీర్… మొదటి సినిమా సవారీయతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. ఆ తరువాత రాజనీతి, రాక్ స్టార్, బర్ఫీ, తమషా, సంజు, బ్రహ్మాస్త్ర వంటి సినిమాలతో తన నట విశ్వరూపం చూపించి బాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోల్లో ఒకరిగా నిలిచారు.
ప్రస్తుతం రణ్ బీర్ కపూర్… అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కించిన యానిమన్ సినిమాతో డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఈ యానిమల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా పాల్గొన్న దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)… తన అభిమాన హీరో రణ్ బీర్ కపూర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.
Mahesh Babu-Rajamouli – రణ్ బీర్‌కు నేను పెద్ద అభిమానిని- మహేష్ బాబు
‘యానిమల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకనుద్దేశించి మహేశ్ బాబు మాట్లాడుతూ… ‘‘యానిమల్’ సినిమా ట్రైలర్ చూశా… అదిరిపోయింది. ఇంతటి ఒరిజినల్ ట్రైలర్ ను నేను ఇప్పటివరకు చూడలేదు. సందీప్ అంటే నాకు ఇష్టం. అతను ఫోన్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానించగానే రావాలనిపించింది. ఆయన అంటే నాకు ఇష్టం.
రణ్‌బీర్‌కు నేను పెద్ద అభిమానిని. ఆయనతో ఈ విషయం ఎప్పుడో చెప్పా గానీ తేలిగ్గా తీసుకున్నారు. అందుకే ఈ వేదికపై మరోసారి చెబుతున్నా. రణ్‌బీర్ ఇండియాలో ది బెస్ట్ యాక్టర్ అని నా అభిప్రాయం. ఈ సినిమా పెద్ద విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని అన్నారు.
ఈ సందర్భంగా రణ్ బీర్ మాట్లాడుతూ… మహేశ్ బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా నాకు బాగా నచ్చింది. ఆ సినిమా చూసిన వెంటనే ఆయనకు మెసేజ్ పెట్టా. ఈ రోజు నా సినిమా వేడుకకు ఆయన అతిథిగా రావడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు.
నా ఫేవరెట్ హీరో రణ్ బీర్- రాజమౌళి
‘‘ఏటా కొత్త దర్శకులు వస్తుంటారు. పెద్ద సినిమాలు తెరకెక్కించి ఘన విజయాలు అందుకుంటారు. అయితే సినిమాని ఇలానే తీయాలనే ఫార్ములాను బ్రేక్ చేసే దర్శకులు చాలా అరుదుగా వస్తుంటారు. ఆ అరుదైన దర్శకుల్లో రామ్‌గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా ముందువరుసలో ఉన్నారు. టీజర్ చూడగానే ‘యానిమల్’ చిత్రాన్ని చూడాలని నిర్ణయించుకున్నా. బాలీవుడ్‌లో నా ఫేవరెట్ హీరో ఎవరని అడిగిన ప్రతిసారీ నా సమాధానం రణ్‌బీర్ కపూర్. అద్భుతమైన నటుడాయన’’ అంటూ రణ్ బీర్ ను ప్రశంసలతో ముంచెత్తారు.
Also Read : Shakila: టాలీవుడ్ ను వెంటాడుతున్న కాస్టింగ్ కౌచ్ వివాదాలు