Mahesh Babu: విలక్షణ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటి ఇంద్రజ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, ఇంద్రజ, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రల్లో నటించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించారు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఇటీవల రిలీజై థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. ఈ మధ్య వచ్చిన బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇదేనని అన్నారు. ఈ మేరకు ఆయన చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. అంతే కాకుండా ఈ చిత్ర నిర్మాత అయిన తబిత సుకుమార్‌ను అభినందించారు.
Mahesh Babu – మహేశ్ బాబుకు తబిత రిప్లై !
అయితే మహేశ్ బాబు తమ సినిమాను అభినందించడంపై తబిత సుకుమార్ స్పందించారు. మా సినిమాను చూసి మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. మీ సపోర్ట్ లభించడం మా మూవీకి పెద్ద ఘనత అన్నారు. మారుతీనగర్ సుబ్రమణ్యం చిత్రాన్ని మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : Mohan Lal: చిత్రపరిశ్రమను నాశనం చేయకండి – మోహన్‌లాల్