Mahesh Babu : ప్రిన్స్ షాక్ జ‌వాన్ కిర్రాక్

ఖాన్ న‌ట‌న అద్భుతం

Mahesh Babu : హైద‌రాబాద్ – ప్రిన్స్ మ‌హేష్ బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. బాలీవుడ్ న‌టుడు షారుక్ ఖాన్, న‌య‌న‌తార‌, దీపికా ప‌దుకొనే, విజ‌య్ సేతుప‌తి న‌టించిన జ‌వాన్ ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 7న విడుద‌లైంది.

Mahesh Babu Appreciates Jawan Movie Team

తొలి రోజే రికార్డులు బ్రేక్ చేసింది. ఏకంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 125 కోట్ల క‌లెక్ష‌న్స్ దాటేసింది. షారుక్ కెరీర‌లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచి పోతుంద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. ప్రిన్స్ మ‌హేష్ బాబు స్పందిస్తూ..షారుక్ ఖాన్ న‌ట‌న‌ను మెచ్చుకున్నారు.

ప్ర‌త్యేకించి త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు అట్లీ కుమార్ టేకింగ్ ను మెచ్చుకున్నాడు. షారుక్ ఖాన్ రియల్లీ కింగ్ అంటూ ప్ర‌శంసించాడు మ‌హేష్ బాబు(Mahesh Babu). అద్భుత‌మైన ఫైట్స్ , ఆక‌ట్టుకునే స‌న్నివేశాలు, మ‌న‌సు దోచుకునే మాట‌లు, ఆపై ఉత్కంఠ భ‌రితంగా సాగే న‌టీ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌, వెర‌సి సినిమాకు హైలెట్ గా నిలిచిన అనిరుద్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ మ్యాజిక్ చేసిందంటూ కితాబు ఇచ్చాడు ప్రిన్స్ .

కింగ్ షారుక్ ఖాన్ త‌న రికార్డుల‌ను తానే తిర‌గ రాస్తాడ‌ని ఆ న‌మ్మ‌కం త‌న‌కు ఉందంటూ పేర్కొన్నాడు. జ‌వాన్ సినిమా చాలా బాగుంద‌ని, బాద్ షా కెరీర్ లో ఇది మ‌రిచి పోలేని చిత్రంగా..జ్ఞాప‌కంగా ఉండి పోతుంద‌ని కితాబు ఇచ్చాడు మ‌హేష్ బాబు.

Also Read : G Marimuthu : జైల‌ర్ న‌టుడు క‌న్నుమూత

Comments (0)
Add Comment