Mahesh Babu: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కించిన సినిమా ‘గుంటూరు కారం’. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధా కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబినేషన్ లో అతడు, ఖలేజా తరువాత వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ప్రమోషన్లలో స్పీడ్ బాగా పెంచింది. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ‘దమ్ మసాలా’, ‘ఓ మై బేబీ’ అనే రెండు పాటలు కూడా శ్రోతల్ని ఆకట్టుకోగా… తాజాగా ‘కుర్చీ మడతపెట్టి’ అనే మాస్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో మహేశ్-శ్రీలీల వేసిన మాస్ స్టెప్పులకు… ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
Mahesh Babu Guntur Kaaram Song Viral
చిత్ర యూనిట్ విడుదల చేసిన మాస్ పాట ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ అభిమానులకు నచ్చడం సంగతి పక్కనబెడితే ఊహించని విధంగా ఈ పాట కాంట్రవర్సీకి కేరాఫ్ అయిపోయింది. ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న మహేశ్ బాబు(Mahesh Babu)… ‘కుర్చీ మడతపెట్టి’ అనే పాటని ఎలా అంగీకరించాడు అని సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో పాట ఓనర్ కుర్చీ తాత గురించి, పాట కోసం అతడికిచ్చిన రెమ్యునరేషన్ గురించి కూడా సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది.
హైదరాబాద్‌లోని కాలా పాషా అనే ఓ తాత… గతంలో ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి చెబుతూ ‘కుర్చీ మడతపెట్టి..’ అని బూతు పదంతో కూడిన లైన్ వాడాడు. ఈ ‘కుర్చీ మడతపెట్టి’ అనే మాట సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. దీనితో అతను కుర్చీ తాతగా క్రేజ్ గుర్తింపు పొందాడు. ఇప్పుడు అతని డైలాగ్ ను తమన్ ఏకంగా పాటగా మార్చేశాడు. దీనికోసం ఆ కుర్చీతాతకు థమన్… రెమ్యూనరేషన్ క్రింద ఐదువేల రూపాయలు ఇచ్చినట్లు గతంలో పాషా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీనితో ఐదువేల రూపాయలతో ‘కుర్చీ మడతపెట్టి’ అనే బూతు డైలాగ్ ను కొని… మాస్ సాంగ్ గా ప్రేక్షకుల ముందుకు తెచ్చాడంటూ థమన్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Jayapradha: అజ్ఞాతంలో జయప్రద… వెతుకుతున్న పోలీసులు