Mahesh Babu: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘గుంటూరు కారం’. గుంటూరు మిర్చియార్డు నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ గా వస్తున్న ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన శ్రీ లీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనితో మహేశ్ బాబుతో(Mahesh Babu) పాటు ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న మీనాక్షి చౌదరితో ఓ ముఖ్యమైన పాటను తెరకెక్కిస్తున్నారు.
Mahesh Babu- శరవేగంగా మహేష్-మీనాక్షి మాస్ సాంగ్
హైదరాబాద్ లోప్రత్యేకంగా రూపొందించిన ఈ సెట్ లో వారం రోజుల పాటు యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరితో మహేశ్ బాబు మాస్ స్టెప్పులు వేస్తున్నారట. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ పాట మాస్ ప్రేక్షకులను అలరించడంతో పాటు సినిమాలో కీలకం కాబోతుందని టాక్. ‘గుంటూరు కారం’ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Aamir Khan: బాలీవుడ్ హీరోను చెంపదెబ్బ కొట్టిన క్యారెక్టర్ ఆర్టిస్ట్