Mahesh Babu: సినిమా ఏదైనా… హీరో ఎవరైనా… బొమ్మ పడుతుందంటే చాలు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పండుగ వాతావరణం ఉంటుంది. ఎప్పుడు… ఏ సినిమా రిలీజ్ అయినా భారీ కటౌట్స్, అభిమానుల ప్రత్యేక పూజలు, డ్యాన్సులు, ర్యాలీలు, పాలాభిషేకాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, తీన్ మార్, బాణసంచా సంబరాలతో క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య, సుదర్శన్, దేవి, సప్తగిరి థియేటర్ల వద్ద కోలాహలం నెలకొంటుంది. హిట్, ప్లాఫ్ తో సంబంధం లేకుండా… క్రాస్ రోడ్స్ థియేటర్స్ లో విడుదలైన సినిమాలకు, హీరోలకు వారి అభిమానులు బ్రహ్మరధం పడతారు. మాస్, క్లాస్, సెలబ్రెటీలు, చివరికి సినిమా యూనిట్ కూడా ఇక్కడే సినిమా చూడటానికి ఆశక్తి చూపిస్తారు.
ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల గురించి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. మల్టీఫ్లెక్స్ కల్చర్ వచ్చిన తరువాత సింగిల్ థియేటర్లు కూడా మల్టీఫ్లెక్స్ గా మారుతున్నాయి. అయినప్పటికీ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య, సుదర్శన్, దేవి థియేటర్లు మాత్రం ఇంకా అలాగే కొనసాగుతున్నాయి అంటే వాటికున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
Mahesh Babu New Theatre
ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో దేవి, సుదర్శన్ 35MM, సంధ్య థియేటర్స్ ఉన్నాయి. సుదర్శన్ 70MM సింగిల్ స్క్రీన్ అనివార్య కారణాల వల్ల 2010లో అది మూతపడింది. అయితే ఇప్పుడు దానిని మహేశ్ బాబు(Mahesh Babu) రీ ఓపెన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అందులో AMB పేరుతో 7 స్క్రీన్స్ ఉండేలా మల్టీఫ్లెక్స్ ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేశారని తెలుస్తోంది. AMB క్లాసిక్ పేరుతో అక్కడ బిగ్ మల్టీఫ్లెక్స్ ప్రారంభం కాబోతుందని సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ముఖ్యంగా మహేశ్ బాబుకు(Mahesh Babu)… సుధర్శన్ ఫేవరెట్ థియేటర్. అందుకే గుంటూరు కారం సినిమా షూటింగ్ కూడా అక్కడ కొంత భాగం తీశారు.
అంతేకాదు తన ప్రతి సినిమాను మొదటిరోజు ఫ్యాన్స్‌తో సహా ఆయన కుటుంబ సభ్యులు అక్కడే చూస్తారు. ఈ నేపథ్యంలో ఈ సుదర్శన్ బిగ్ స్క్రీన్ ను మల్టీఫ్లెక్స్ గా డవలెప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు… ఏసియన్ సినిమాస్ తో కలిసి AMB మల్టీఫ్లెక్స్ బిజినెస్ ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు.
మహేష్ బాబు ‘AMB’ పేరుతో ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో గచ్చిబౌలిలో భారీ మల్టీప్లెక్స్ నిర్మించారు. బెంగుళూరులో కూడా మరో థియేటర్ ను త్వరలో ప్రారంభించనున్నారు. ఏడాది క్రితం అల్లు అర్జున్… అమీర్‌పేట్ లో ‘AAA’ సినిమాస్ పేరుతో మల్టీఫ్లెక్స్ ను నిర్మించారు. విజయ్ దేవరకొండ మహబూబ్‌నగర్ లో ‘AVD’ పేరుతో మూడు స్క్రీన్స్ ఉన్న థియేటర్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. త్వరలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ‘ART’ సినిమాస్ అనే పేరు దిల్ సుఖ్ నగర్ లో మల్టీఫ్లెక్స్ ప్రారంభించబోతున్నారు.
Also Read : Ruhani Sharma: గ్లామర్ డోస్ పెంచిన రుహానీ ! మంటలు రేపుతున్న లేటెస్ట్ ఫోటోలు !