Mahesh Babu: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టే సమయం ఆసన్నమైంది.
Mahesh Babu Vacation
హైదరాబాద్ వేదికగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చివరిపాటతో ఈ సినిమా పూర్తైపోయినట్లే. శ్రీలీల, మీనాక్షీ చౌదరి, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కనుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. దీనితో మరో రెండు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసి మహేష్ బాబు… తన ఫ్యామిలీతో ఫారిన్ వెకేషన్ కు బయలుదేరుతున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే చేసుకుని… కొత్త సంవత్సరంలో హైదరాబాద్ లో అడుగుపెడతారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అంతేకాదు ఫారిన్ నుంచి తిరిగి రాగానే ‘గుంటూరు కారం’ ప్రమోషన్స్ తో బిజీ అవుతారని తెలుస్తోంది.
Also Read : Hero Raviteja: ‘గల్లంతే’ అంటూ వస్తున్న రవితేజ ‘ఈగల్’