Mahesh Babu : తెలంగాణ వరద బాధితుల సహాయ చెక్ ను సీఎం కు అందజేసిన మహేష్

తెలంగాణ వరద బాధితుల సహాయ చెక్ ను సీఎం కు అందజేసిన మహేష్..

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన హృదయ ఔదార్యని చాటుకున్నారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా ఉక్కిరి బిక్కిరి అయిన తెలుగు రాష్ట్రాలకు ఆయన చెరో 50 లక్షలా సహాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన రూ. 50 లక్షల చెక్కును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన్ని కలిసి అందించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు భార్య నమ్రతా శిరోద్కర్ పాల్గొన్నారు. అలాగే రూ.50 లక్షల చెక్కుతో పాటు తన AMB సినిమాస్ తరుపున మరో 10 లక్షల చెక్కుని అందించారు.

Mahesh Babu Given…

అలాగే మరికొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు‌కి మరో చెక్కు అందజేయనున్నట్లు సమాచారం. లాంగ్ హెయిర్, థిక్ బేయర్ద్ లుక్‌లో మహేష్‌ని చూసి అభిమానులు ఏమున్నాడ్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మహేష్ రాజమౌళి దర్శకత్వంలో నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. గ్లోబల్ వైడ్‌గా తెలుగు సినిమా సత్తా‌ని నిరూపించిన రాజమౌళి ప్రాజెక్ట్ కావడంతో సర్వత్రా దీనిపై ఆసక్తి నెలకొంది. అటవీ నేపథ్యంలో రూపొందుతున్న సమాచారం మినహా ఈ సినిమాకి సంబంధించిన ఏ ఇతర వివరాలు ఇంకా బయటకి రాలేదు. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.

Also Read : Megastar Chiranjeevi: చికున్ గున్యాతో బాధపడుతున్న మెగాస్టార్ చిరంజీవి !

FloodsMahesh BabuUpdatesViral
Comments (0)
Add Comment