Mahesh Babu Foundation : మహేష్ బాబు ఫౌండేషన్ చేయూత‌

చిన్నారుల‌తో మ‌హేష్ కొడుకు గౌత‌మ్

Mahesh Babu Foundation : ప్ర‌ముఖ న‌టుడు మహేష్ బాబు స్వంతంగా మ‌హేష్ బాబు ఫౌండేష‌న్ ను ఏర్పాటు చేసి చిన్నార‌ల‌కు చేదోడుగా నిలుస్తున్నారు. స్వ‌చ్చంధ సంస్థ ఆరోగ్య శిబిరాల‌తో పాటు అవ‌స‌ర‌మైన పిల్ల‌ల‌కు గుండె ఆప‌రేష‌న్లు చేయించ‌డంలో తోడుగా ఉంటోంది. ఇందుకు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Mahesh Babu Foundation for Helping Poor

మ‌హేష్ బాబుతో పాటు భార్య న‌ర్మ‌దా శిరోద్క‌ర్, చిన్నారులు గౌత‌మ్, సితార‌లు అప్పుడ‌ప్పుడు రెయిన్ బో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల‌ను ప‌రామ‌ర్శిస్తారు. వారికి చిరు కానుక‌లు కూడా అంద‌జేస్తారు. వారికి భ‌విష్య‌త్తు ప‌ట్ల మ‌రింత న‌మ్మ‌కాన్ని ఇచ్చేలా చేస్తారు. వారికి ధైర్యం చెబుతారు.

తాజాగా గౌత‌మ్ ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా ఆప‌రేష‌న్ పూర్త‌యి కోలుకున్న బాబును ప‌రామ‌ర్శించారు. తాము ఉన్నామంటూ ధైర్యం చెప్పారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను మ‌హేష్ బాబు ఫౌండేష‌న్(Mahesh Babu Foundation) ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేసింది.

అవ‌స‌ర‌మైన వారు, ఆప‌ద‌లో ఉన్న వారు త‌మ‌కు సాయం కావాల్సి వ‌స్తే మ‌హేష్ బాబు ఫౌండేష‌న్ ను సంప్ర‌దించాల‌ని కోరారు ప్రిన్స్ మ‌హేష్ బాబు. ద‌క్షిణాది సినీ రంగంలో మోస్ట్ పాపుల‌ర్ హీరోగా గుర్తింపు పొందారు. ఆయ‌న తండ్రి ప్ర‌ముఖ న‌టుడు కృష్ణ‌. ఇటీవ‌లే ఆయ‌న కాలం చేశారు. ఓ వైపు సినిమాల‌లో బిజీగా ఉంటూనే మ‌రో వైపు సామాజిక కార్య‌క్ర‌మాల‌ను చూస్తున్నారు ప్రిన్స్. ఆయ‌న‌కు తోడుగా ఉంటోంది న‌మ్ర‌తా శిరోద్క‌ర్.

Also Read : Mrunal Thakur Vs Neha Shetty

Comments (0)
Add Comment