Mahesh Babu : ‘ముఫాసా’ సినిమాతో ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన మహేష్ ఫ్యాన్స్

Mahesh Babu : సోషల్ మీడియా ట్రెండ్స్‌లో మహేష్ బాబు ఫ్యాన్స్ అందరి హీరోల అభిమానుల కంటే ముందుంటారు. అలాగే టికెట్స్ బుకింగ్స్, కలెక్షన్స్ విషయంలోను కొత్త హిస్టరీలను ఎప్పటికప్పుడు కొత్తగా సృష్టిస్తూనే ఉంటారు. ప్రస్తుతం మహేష్ సినిమా ఏది రిలీజ్ లేకపోయినప్పటికీ బాబు ఫ్యాన్స్ సరికొత్త రికార్డ్ సృష్టించారు. ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణసంస్థ డిస్నీ తెరకెక్కించిన ‘ముఫాసా’: ది లయన్‌ కింగ్‌(Mufasa)’ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఇంగ్లీష్ వెర్షన్ కి ఆరోన్‌ స్టోన్‌, కెల్విన్‌ హ్యారిసన్‌ జూనియర్‌ తదితరులువాయిస్ అందించగా హిందీలో షారుఖ్ ఖాన్ తన గాత్రాన్ని అందించారు. ఇక తెలుగులో మహేష్ బాబు, సత్యదేవ్, బ్రహ్మానందం, అలీ తదితరులు వాయిస్ అందించిన విషయం తెలిసిందే.

Mahesh Babu Mufasa Movie Updates

అయితే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ లో ఈ మూవీ ఉదయం 8 గంటల షో హౌస్ ఫుల్ అయ్యింది. అయితే ఈ సినిమాకి ఇండియాలోని అన్ని థియేటర్ల కన్న ముందే ఫుల్ కావడం విశేషం. ఇది కంప్లీట్‌గా మహేష్ బాబు ఫ్యాన్స్ డామినేషన్. కేవలం వాయిస్‌కే కటౌట్లు పెట్టి, హౌస్ ఫుల్స్‌తో రికార్డులు నెలకొల్పతున్న మ్యాడ్‌నెస్ ఆయన అభిమానులకు మాత్రమే సొంతం. మరోవైపు మహేష్, రాజమౌళి సినిమా జనవరి ద్వితీయార్థంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్‌ మొదలుపెడతారు. ఇప్పటికే ఏర్పాటు జరుగుతున్నాయి. అయితే రాజమౌళి స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త సమయం తీసుకోబోతున్నారని, ఏప్రిల్‌ వరకూ షూటింగ్‌ మొదలు కాదని అనుకున్నారు. అయితే జనవరిలోనే ఈ సినిమా ప్రారంభానికి శ్రీకారం చుట్టడం అభిమానులకు కాస్త ఆశ్చర్యంగా ఉంది.

Also Read : Director Sukumar : సంధ్య థియేటర్ బాధితుడు శ్రీతేజ్ ను పరామర్శించిన డైరెక్టర్

CinemaMahesh BabuMufasaTrendingUpdatesViral
Comments (0)
Add Comment