Mahesh Babu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేశ్ బాబు ఫ్యామిలీ !

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేశ్ బాబు ఫ్యామిలీ !

Mahesh Babu: సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు ఫ్యామిలీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కూతురు సితారతో కలిసి గురువారం ఉదయాన్నే మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారికి స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు వారు అలిపిరి నుంచి కాలి నడకన తిరుమలకు చేరుకున్నారు. అయితే వీరితో మహేశ్ బాబు రాకపోవడంతో… రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్ ప్యామిలీ తిరుమల ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Mahesh Babu Visited…

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబినేషన్ లో త్వరలో సినిమా ప్రారంభం కాబోతుంది. ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ వర్కింగ్ టైటిల్ తో ప్రారంభం కాబోయే ఈ సినిమాను సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇటీవల చెప్పిన మాటల ప్రకారం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే అడ్వంచరెస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే ఈ సినిమాలో యాక్షన్ స్వీక్వెన్స్, ఫిట్ నెస్ మరియు కొత్త లుక్ కోసం మహేశ్ బాబు ఇప్పటికే జర్మనీ వెళ్లి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ చిత్రానికి మహారాజ్‌ అనే టైటిల్‌ పెట్టనున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.

Also Read : Kanguva: సూర్య ‘కంగువా’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది !

Namrata ShirodkarSitara GhattamaneniSuper Star Mahesh Babu
Comments (0)
Add Comment