Mahesh Babu Daughter Sitara: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో తాజాగా వచ్చిన సినిమా ‘గుంటూరుకారం’. వీరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా తరువాత భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ ను సంపాదించినప్పటికీ… కలెక్షన్ల పరంగా మహేశ్ బాబు సత్తాను చాటింది. ‘గుంటూరుకారం’ సినిమాకు థియేటర్ల వద్ద కాస్తా సందడి తగ్గినప్పటికీ… సోషల్ మీడియాలో మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే ఆ సినిమా నుండి వచ్చిన కుర్చీ మడతపెట్టి పాట రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఆ సినిమాలో మరో పాట ‘దమ్ మసాలా’ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనికి వచ్చింది. దీనికి కారణం మహేశ్ బాబు గారాల పట్టి సితార… ఈ పాటకు ప్రత్యేకంగా డ్యాన్స్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమేనట.
Mahesh Babu Daughter Sitara Dance Viral
టాలీవుడ్ స్టార్ కిడ్స్ అందరిలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సితార… రెండు మిలయన్లకు పైగా ఇన్ స్టా ఫాలోవర్స్ ను సంపాదించి… మహేశ్ బాబు(Mahesh Babu) కూతురిగానే కాకుండా తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. మరోవైపు సేవా కార్యక్రమాలతో కూడా పాపులారిటీ సంపాదించింది. ఇప్పటికే పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలు, వీడియోలతో పాపులరైన సీతార… తాజాగా కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తోంది. భవిష్యత్ లో సితార కూడా సినిమాల్లోకి వస్తుందని నమ్రత ఇప్పటికే పలుమార్లు చెబుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సితార కూడా చదువుతో పాటు క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకుంది. అప్పుడప్పుడు పలు సూపర్ హిట్ సాంగ్స్‌కు ఆమె డ్యాన్స్ చేస్తూ అభిమానులను మెప్పిస్తూ ఉంటుంది.
తాజాగా ‘గుంటూరు కారం’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘దమ్ మసాలా’ కు సితార అద్భుతమైన డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో సితార డాన్సుకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. గుంటూరు కారంలో హీరోయిన్ శ్రీలీలకు ఏ మాత్రం తగ్గకుండ సితార డ్యాన్స్ ఉందని కామెంట్లు చేస్తున్నారు. సీతూ పాప డ్యాన్స్ త్రీ డీలో కనిపిస్తుందని ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. సితార డ్యాన్స్ వీడియోకు ఇప్పటి వరకు 50 లక్షల వ్యూస్ వచ్చాయి.
Also Read: Leader 2 Movie : లీడర్ 2 పొలిటికల్ థ్రిల్లర్ తో రానున్న రానా దగ్గుబాటి