Mahesh Babu : ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా కోసం విన్న చూస్తా అంటూ వ్యాఖ్యానించిన మహేష్

'కమిటీ కుర్రోళ్ళు' సినిమా కోసం విన్న చూస్తా అంటూ వ్యాఖ్యానించిన మహేష్..

Mahesh Babu : ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. మౌత్ టాక్ బాగా వ‌స్తుండ‌డంతో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. మంచి ఫ్యామిలీ స్టోరీతో కుటుంబ ప్రేక్ష‌కుల‌ను, యవ‌త‌ను బాగా ఆక‌ట్టుకున్న ఈ చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని వీలేజ్ హ్యాపీడేస్ అనే పేరును సంపాదించుకోవ‌డం విశేషం. మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ చిత్రం రూపొందగా య‌దు వంశీ ద‌ర్శ‌కత్వం చేశారు.

Mahesh Babu Comment

విడుద‌లైన ప్ర‌తి చోటా సినిమాకు ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు సినీ సెల‌బ్రిటీల అప్రిషియేష‌న్స్ కూడా అందుకుంటోంది. తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్(Mahesh Babu) ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్ర యూనిట్‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభినందించారు. ‘ కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు సంబంధించి మంచి విష‌యాలు విన్నాను. తొలి చిత్రంతో నిర్మాత‌గా స‌క్సెస్‌గా సాధించిన నిహారిక కొణిదెల‌కు అభినంద‌న‌లు. సినిమాలో స‌క్సెస్‌లో భాగ‌మైన చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు. సినిమాను త్వ‌ర‌లోనే చూస్తాను’ అంటూ మ‌హేష్ తెలియ‌జేశారు. ‘ కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తూ ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రించార‌ని ..రానున్న రోజుల్లో క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరుగుతాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి.

Also Read : Kiran Abbavaram : నెట్టింట వైరల్ అవుతున్న హీరో కిరణ్ సబ్బవరం ప్రీ వెడ్డింగ్ ఫోటోలు

CinemaCommentsCommittee KurrolluMahesh BabuTrendingViral
Comments (0)
Add Comment