Beauty Monalisa : కుంభ మేళా మోనాలిసాకు మూవీ ఛాన్స్

క‌న్ ఫ‌ర్మ్ చేసిన ద‌ర్శ‌కుడు స‌నోజ్ మిశ్రా

Monalisa : ప్ర‌యాగ్ రాజ్ లో కొన‌సాగుతున్న మ‌హా కుంభ మేళాలో పూస‌లు అమ్ముకుంటూ సెన్సేష‌న్ గా మారిన మోనాలిసాకు ఉన్న‌ట్టుండి బంప‌ర్ ఛాన్స్ ల‌భించింది. బాలీవుడ్ కు చెందిన ద‌ర్శ‌కుడు స‌నోజ్ మిశ్రాకు తాను తీయ‌బోయే ది డైరీ ఆఫ్ మ‌ణిపూర్ మూవీలో మోనాలిసాను కీ రోల్ లో పోషించేందుకు ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌క‌టించాడు. దీంతో మ‌రోసారి నెట్టింట్లో వైర‌ల్ గా మారింది మోనాలిసా.

Beauty Monalisa Got Movie Chance..

త‌ను పేద కుటుంబానికి చెందిన మ‌హిళ‌. ఎక్క‌డ జాత‌ర‌లు జ‌రిగినా దండ‌లు, పూస‌లు అమ్ముతూ జీవ‌నం సాగిస్తూ వ‌స్తోంది. ఈసారి మ‌హా కుంభ మేళాలో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది మోనాలిసా(Monalisa). త‌న క‌ళ్లు, మాట్లాడే విధానం అద్బుతంగా ఉండ‌డంతో భ‌క్తులు, ఇత‌రులంతా ఆమెను ఆకాశానికి ఎత్తేస్తూ వ‌చ్చారు.

మోనాలిసా స్వ‌స్థ‌లం మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్ . గ‌తంలో ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ మూవీ తీశాడు స‌నోజ్ మిశ్రా. ఈ మూవీతో త‌ను పాపుల‌ర్ అయ్యాడు. త్వ‌ర‌లోనే మూవీ తెర మీద‌కు రానుంద‌ని ప్ర‌క‌టించాడు. త‌ను తీయబోయే సినిమాలోని పాత్ర‌కు మోనాలిసా క‌రెక్టుగా స‌రి పోతుంద‌ని, అందుకే త‌న‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలిపాడు డైరెక్ట‌ర్. ఇదిలా ఉండ‌గా త‌న‌ను క‌లిసేందుకు ఎక్కువ మంది రావ‌డంతో త‌ట్టుకోలేక పోయింది మోనాలిసా.

Also Read : Glamorous Regina : హిందీ మూవీలో న‌టిస్తున్నాన్న రెజీనా

MonalisaTrendingUpdates
Comments (0)
Add Comment