Madhuri Dixit: ఎన్నికల బరిలో బాలీవుడ్ బ్యూటీ ?

ఎన్నికల బరిలో బాలీవుడ్ బ్యూటీ ?

Madhuri Dixit: ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ రాజకీయ రంగ ప్రవేశం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజే(BJP)పి తరపున పోటీ చేస్తారంటూ గత కొంతకాలంగా వస్తున్న పుకార్లు దాదాపు నిజమని తేలుతుంది. దీనికి ఇటీవల ఆమె బిజేపి సీనియర్ నేత అమిత్ షాతో భేటి కావడం… ఇది జరిగిన కొద్ది రోజులకే మహారాష్ట్రలోని ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో ఆమె బ్యానర్లు వెలియడం నిదర్శనంగా నిలుస్తోంది. నార్త్ ముంబై లోక్ సభ నియోజకవర్గం నుండి ప్రస్తుత బిజేపి ఎంపీ పూనమ్ మహాజన్ స్థానంలో మాధురీ దీక్షిత్ పోటీ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే బిజేపి నుండి గాని మాధురీ దీక్షిత్(Madhuri Dixit) నుండి గాని ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Madhuri Dixit – మాధురీ ఇంటికి అమిత్ షా

మాధురీ దీక్షిత్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే వార్తలు చాలా రోజుల నుండి వినిపిస్తున్నాయి. ఈ పుకార్లకు బలం చేకూర్చేవిధంగా కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబైలోని మాధురీ దీక్షిత్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు సంబంధించిన బుక్‌లెట్‌ను ఆమెకు బహుమతిగా ఇచ్చారు. దీనితో మాధురీ దీక్షిత్ బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిలబడతారనే దానికి మరింత బలం చేకూరింది. బిజేపి బలంగా ఉన్న నార్త్-ముంబై, నార్త్ సెంట్రల్ ముంబైలో ఏదో ఒక స్థానం నుండి ఆమె పోటీకు దిగనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం నార్త్ సెంట్రల్ ముంబై లోక్ సభ నియోజకవర్గంలో దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనమ్ మహాజన్ ఎంపిగా కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 2014, 2019లో వరుసగా రెండుసార్లు ఆమె విజయం సాధించారు. అయితే సాయిబాబ వార్షిక ఉత్సవాల సందర్భంగా ఈ ప్రాంతమంతా నటి మాధురీ దీక్షిత్ బ్యానర్లు వెలిశాయి. అక్కడ మాధురీ దీక్షిత్ బ్యానర్ లేదా ఫ్లెక్స్ బహిరంగంగా పెట్టడం ఇదే తొలిసారి కావడంతో ఈ స్థానం నుండి ఆమె పోటీ చేస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

మరోవైపు నటి మాధురీ దీక్షిత్‌కు సంబంధించిన ఆ బ్యానర్స్‌తో బీజేపీ ఎన్నికలతో ఎటువంటి సంబంధం లేదని అక్కడి నేతలు కొందరు చెప్పుకొస్తున్నారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రముఖులకు, వ్యాపారులకు, సినీ పరిశ్రమకు చెందిన వారికి చేరవేయడంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. నటి మాధురీ దీక్షిత్ ఇంటికి వెళ్లారు. అయితే మాధురీ దీక్షిత్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా? ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి.

Also Read: Amy Jackson: ‘క్రాక్‌’ అయిపోయింది అంటున్న అమీ జాక్సన్

Madhuri Dixit
Comments (0)
Add Comment