Madhuri Dixit: రూ 1.5 కోట్ల విలువైన స్విగ్గీ షేర్స్ కొనుగోలు చేసిన మాధురీ దీక్షిత్ !

రూ 1.5 కోట్ల విలువైన స్విగ్గీ షేర్స్ కొనుగోలు చేసిన మాధురీ దీక్షిత్ !

Madhuri Dixit: ప్రముఖ నటి ‘మాధురీ దీక్షిత్’ ఇటీవల ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీలో రూ. 1.5 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ షేర్లను ఇన్నోవ్8 వ్యవస్థాపకులు ‘రితేష్ మాలిక్’ నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మాధురీ దీక్షిత్, రితేష్ మాలిక్ ఇద్దరూ రూ. 3 కోట్ల విలువైన షేర్స్ కొనుగోలు చేసి స్విగ్గిలో వాటాదారులయ్యారు. వీరిరువురు ఒక్కో షేరుకు రూ. 345 చొప్పున చెల్లించినట్లు సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.

Madhuri Dixit…

బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్విగ్గీ… త్వరలోనే ఐపీఓకు రానుంది. ఈ ఐపీఓ ద్వారా సుమారు ఒక బిలియన్ డాలర్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. అయితే ఈ ఐపీఓకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ ఆదాయం 36 శాతం పెరిగి రూ. 11,247 కోట్లకు చేరుకుంది. కాగా ఇప్పటికే స్విగ్గిలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఇన్వెస్ట్ చేసారు. దీనితో బాలీవుడ్ అగ్రతారలు ఒక్కొక్కరు స్విగ్గీ షేర్స్ పై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : Vignesh Shivan: బుర్జ్‌ ఖలీఫా వద్ద తన భర్త బర్త్ డే సెలబ్రేషన్స్‌ నిర్వహించిన నయనతార !

Amitabh BachchanMadhuri DixitSwiggy
Comments (0)
Add Comment