Madhurapudi: `అక్కడొకడుంటాడు` ఫేమ్ శివ కంఠమనేని హీరోగా కళ్యాణ్ రామ్ “కత్తి” ఫేమ్ మల్లి దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘మధురపూడి గ్రామం అనే నేను’. క్యాథలిన్ గౌడ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మెలోడి బ్రహ్మ మణిశర్మ అందించారు. జి.రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్‌పై కేఎస్ శంకర్ రావు, ఆర్.వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 13న విడుదలై మంచి టాక్ సంపాదించింది. తన ప్రాణ స్నేహితుడు ఊర్లో రాజకీయ నాయకుడిగా ఎదగడానికి సూరి పాత్రలో శివ కంఠమనేని చేసిన సాహసం, త్యాగం వెరసి ఓ గ్రామం ఆత్మకథను ఇతి వృత్తంగా తెరకెక్కించిన ఈ సినిమా బి, సి సెంటర్లలో పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.
Madhurapudi – జనవరిలో అవార్డు అందుకోనున్న చిత్ర యూనిట్
‘మధురపూడి గ్రామం అనే నేను’ సినిమా ‘రాజస్థాన్(Rajasthan) ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’ 2023కి ఎంపిక అయినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. జైపూర్ వేదికగా జనవరి 27, 2024లో నిర్వహించబోయే 10వ ‘రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ‘‘మా మూవీ భవిష్యత్‌లో మరిన్ని అవార్డులు సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరో శివ కంఠమనేని. ‘‘ఈ సినిమాపై మొదటి నుండి మా టీమ్ చాలా నమ్మకంగా ఉన్నాం. ఈ రోజు మా నమ్మకం నిజమైంది’’ అన్నారు దర్శకుడు మల్లి.
Also Read : Niharika Konidela: సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన మెగా డాటర్