Madhu Bala: నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో, మంచు కుటుంబం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోతోన్న సినిమా ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా.మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘మహాభారత’ సిరీస్ ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్, మోహన్ బాబు, మోహన్‌లాల్, శరత్ కుమార్, శివరాజ్‌కుమార్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఎక్కువగా న్యూజిలాండ్ లోని అద్భుతమైన లోకేషన్స్‌లో చిత్రీకరించారు.ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా, నయనతార పార్వతిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్, నటీనటులు ఫస్ట్ లుక్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
Madhu Bala…
అయితే ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్ నేట్ ను పంచుకుంది ‘కన్నప్ప’ చిత్ర యూనిట్. ప్రముఖ నటి మధుబాల(Madhu Bala)… ఈ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ఆమెకు చెందిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. చెంచుల వీరత్వాన్ని తెలిపేలా ఉన్న ఈ లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా పోస్టర్‌పై రాసిన పదాలు వీరనారి తెగువను తెలుపేలా ఉన్నాయి. ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమాలో మధుబాల ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారుతోంది. దీంతో కన్నప్పపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే పలువురు పాన్ ఇండియా స్టార్స్ ఉండటం వల్ల అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
Also Read : Maruthi Nagar Subramanyam: రావు రమేష్ ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ ట్రైలర్ రిలీజ్ !