Madhavi Latha : హైదరాబాద్ – టాలీవుడ్ నటి మాధవీలత(Madhavi Latha) నిప్పులు చెరిగారు. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గురించి అత్యంత నీచంగా మాట్లాడటం దారుణమన్నారు. బతుకు దెరువు కోసం తాను సినీ రంగంలోకి వెళ్ల లేదని స్పష్టం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. మహిళలంటే అంత చులకన ఎందుకని ప్రశ్నించారు.
Madhavi Latha Challenges..
జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకుంటామా అని నిలదీశారు. క్షమాపణలు చెబితే సరిపోదన్నారు. తాను కూడా రాయలసీమ బిడ్డనేనని గుర్తు పెట్టుకోవాలంటూ హెచ్చరించారు. తాను ఇక్కడే పుట్టి పెరిగానని, రాగి సంగటి తిన్నానని, తనకు కూడా నీలాగే ధైర్యం ఎక్కువగా ఉందని చెప్పారు నటి మాధవీలత.
తాను ఏనాడూ ఎవరి గురించి కామెంట్స్ చేయలేదని, అలాంటప్పుడు తన గురించి వ్యాఖ్యానించే నైతిక హక్కు జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎలా ఉంటుందని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఒక స్థాయికి ఎదిగిన నేతలు మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడాలని హితవు పలికారు. తాను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని, న్యాయ పరంగా కోర్టులో తేల్చుకుంటానని చెప్పారు మాధవీలత.
Also Read : Manchu Manoj Shocking : న్యాయం దక్కే దాకా పోరాడుతా
Madhavi Latha Challenge : జేసీ కామెంట్స్ పై కోర్టులో తేల్చుకుంటా
స్పష్టం చేసిన నటి మాధవీ లత