Mad Square Sensational :మ్యాడ్ స్క్వేర్ టీజ‌ర్ య‌మ‌ క్రేజీ

మూవీ మేక‌ర్స్ సింప్లీ సూప‌ర్

Mad Square : మ్యాడ్ స్క్వేర్ సీక్వెల్ మూవీ టీజ‌ర్ విడుద‌లైంది. మ్యాడ్ గ్యాంగ్ త‌ర్వాత తిరిగి వ‌చ్చింది. ఇది గతంలో కంటే య‌మ క్రేజీగా ఉంది. దీనిని మూవీ మేక‌ర్స్ మ‌రింత ఉత్కంఠ భ‌రితంగా తీయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు ద‌ర్శ‌కుడు.

Mad Square Teaser

మ్యాడ్ మూవీని చిర‌స్మ‌ర‌ణీయ వేసవి వినోద భ‌రితంగా మార్చేందుకు టీం అన్ని విధాలుగా కృషి చేసింద‌ని చెప్ప‌డంలో అతిశ యోక్తి లేదు. ఈ చిత్రానికి క‌ళ్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నార్నే నితిన్, సంగీత్ శోభ‌న్, రామ్ నితిన్ , విష్ణు ఓయిలు కీల‌క పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు.

తొలి భాగంలో కామెడీని పండించేందుకు ట్రై చేశారు. ఈ టీజ‌ర్ లో చిలిపి కెమిస్ట్రీ, ప‌రిపూర్ణ పంచ్ డైలాగులతో పాటు ఓమ‌ర్ మ్యాడ్ నెస్ మ‌రింత న‌వ్వులు పూయించేలా చేసింది. ప్ర‌ధానంగా యూత్ ను మ‌రింత ఆక‌ట్టుకుంటుంది. న‌వ్వులు తెప్పించ‌డ‌మే కాదు ఇంటిల్లిపాది క‌లిసి చూసేలా దీనిని రూపొందించారు ద‌ర్శ‌కుడు.

సినిమా టోగ్ర‌ఫీ శామ్ ద‌త్ సైనుద్దీన్ , జాతీయ పుర‌స్కార గ్ర‌హీత న‌వీన్ నూలి ఎడిటింగ్ , సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీని బ్లాక్ బ‌స్ట‌ర్ చేసిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ సిసిరోలియో మరోసారి మంత్ర‌ముగ్ధుల‌ను చేశాడు త‌న సంగీతంతో మ్యాడ్ స్క్వేర్(Mad Square) మూవీ.

Also Read : Kayadu Lohar Sensational :ఎవ‌రీ కాయ‌దు లోహ‌ర్ ఏమిటా క‌థ

CinemaMad SquareTeaserTrendingUpdates
Comments (0)
Add Comment