Mad Square : టాలీవుడ్ లో ట్రెండ్ మారింది. గతంలో హీరోల ప్రాధాన్యంగా సినిమాలు వచ్చేవి. వాటినే ఎక్కువగా ఆదరించే వారు ప్రేక్షకులు. కానీ కాలంతో పాటు ఫ్యాన్స్ కూడా మారుతున్నారు. ప్రధానంగా యాక్షన్, థ్రిల్లర్, రొమాన్స్ , కామెడీని ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. అంతే కాదు డైలాగులకు పడి పోతున్నారు.
Mad Square Movie Updates
దీంతో కంటెంట్ క్రియేటర్స్ కు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. టాలెంట్ కలిగిన నటీ నటులకు కొదవ లేకుండా పోతోంది. మరో వైపు సందేశాత్మక చిత్రాలకు కూడా ఆదరణ లభిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజై బిగ్ సక్సెస్ అయిన చిత్రం మ్యాడ్. ఇది బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది.
దీనికి సీక్వెల్ గా దర్శకుడు మ్యాడ్ స్క్వేర్(Mad Square) పేరుతో తీశాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు అయి పోవచ్చింది. దీంతో మూవీ మేకర్స్ విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ మేరకు చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా వచ్చే మార్చి 29న విడుదల చేయాలని నిర్ణయించారు. మరో వైపు వేసవి కాలం కావడంతో దీనికి పోటీగా మరో చిత్రం నితిన్, శ్రీలీల నటించిన మూవీ రాబోతోంది.
అయితే మూవీ మేకర్స్ మాత్రం ఫుల్ నమ్మకంతో ఉన్నారు. తమ మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుందని. ఎందుకంటే కంటెంట్ తో పాటు కామెడీ కూడా పసందుగా ఉంటుందని పేర్కొంటున్నారు.
రచయిత, దర్శకుడు కళ్యాణ్ శంకర్ మరోసారి తన ప్రతిభను నిరూపించేందుకు రెడీ అయ్యారు. ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్‌తో కలిసి హరికా సూర్యదేవర , సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ సమర్పిస్తున్నారు.
Also Read : Hero Nithin-Robinhood : నితిన్..శ్రీలీల రాబిన్ హుడ్ డేట్ కన్ ఫర్మ్