Mad Square Sensational :మ్యాడ్ 2 పిచ్చెక్కించ‌డం ప‌క్కా

ఫుల్ క్లారిటీతో ఉన్న నిర్మాత నాగవంశీ

Mad Square : టాలీవుడ్ లో ప్ర‌స్తుతం కామెడీ, స‌స్పెన్స్ ప్ర‌ధానంగా వ‌చ్చే మూవీస్ కు ఎక్కువ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దీంతో ప్ర‌తి మూవీలో కాస్తంత వినోదం ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతున్నారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. ఓ కాంట్ర‌వ‌ర్సీ ఉండేలా పాట‌, కాసిన్ని బూతు డైలాగులు, ఎగ‌ర‌డాలు, దూక‌డాలు, ఆపై ప్ర‌మోష‌న్స్ తో హోరెత్తిస్తున్నారు. కానీ ఇందుకు భిన్నంగా వ‌స్తోంది మ్యాడ్ 2(Mad Square) . గ‌తంలో మ్యాడ్ మూవీ రిలీజ్ అయ్యింది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది.

Mad Square Movie Trailer Updates

మ్యాడ్ -2 సీక్వెల్ మూవీలో రామ్ నితిన్, సంగీత్ శోభ‌న్ , శ్రీ గౌరీ ప్రియ‌, నార్నే నితిన్, అనంతిక‌, గోపిక ఉద‌య‌న్, విష్ణు ఓయ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కీరోల్స్ తో మ‌రింత న‌వ్వించేందుకు రెడీ అయ్యారు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్స్, టీజ‌ర్, సాంగ్స్ కు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాను సితార ఎంట‌ర్ టైన్మెంట్ పతాకంపై నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. మార్చి 28న విడుద‌ల చేసేందుకు తంటాలు ప‌డుతున్నారు మూవీ మేక‌ర్స్. ఇప్ప‌టికే అనౌన్స్ కూడా చేశారు.

విచిత్రం ఏమిటంటే మ్యాడ్ 2 సినిమాకు సంబంధించి ట్రైల‌ర్ రిలీజ్ చేస్తామ‌ని అంద‌రికీ స‌మాచారం ఇచ్చారు. తీరా అనుకోకుండా రిలీజ్ చేయ‌డం లేదంటూ చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. ఏది ఏమైనా నిర్మాత నాగ‌వంశీ మాత్రం పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. 2 గంట‌ల‌కు పైగా కేవ‌లం న‌వ్వుకునేందుకే కేటాయించామ‌న్నారు. మ్యాడ్ -2 పిచ్చెక్కించ‌డం ప‌క్కా అంటూ ధీమా వ్య‌క్తం చేస్తున్నాడు .

Also Read : Popular Director Murugadoss :మురుగ‌దాస్ మ‌రోసారి స‌క్సెస్ అవుతాడా..?

CinemaMad SquareTrendingUpdates
Comments (0)
Add Comment