Mad Square : సితార ఎంటర్ టైనర్ బ్యానర్ పతాకంపై నిర్మాత నాగ వంశీ నిర్మించిన చిత్రం మ్యాడ్ స్క్వేర్ సీక్వెల్(Mad Square) మూవీ. ఈ చిత్రం మార్చి 28న విడుదలైంది. తొలి రోజు తొలి షో నుంచే మంచి ఆదరణ చూరగొంది. పాజిటివ్ టాక్ తో దూసుకు పోయింది. దీంతో బాక్సులు బద్దలవుతున్నాయి. ఇప్పటి వరకు సినీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు మ్యాడ్ స్క్వేర్(Mad Square) ఏకంగా రూ. 30 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదే సమయంలో ఈ సినిమాతో పాటే విడుదలైన మరో చిత్రం వెంకీ కుడుముల తీసిన రాబిన్ హుడ్ ఆశించిన మేర రాణించ లేదు. పూర్తిగా నిరాశకు లోను చేసింది.
Mad Square 2 Sensational
ఇదే సమయంలో సినిమా రిలీజ్ కంటే ముందే నిర్మాత నాగవంశీ సంచలన కామెంట్స్ చేశాడు. తమ సీక్వెల్ మూవీ పక్కా సక్సెస్ అవుతుందని, బాక్సులు బద్దలు కొట్టడం ఖాయమని జోష్యం చెప్పాడు. ఏ ముహూర్తాన చెప్పాడో కానీ ఆశించిన దానికంటే సూపర్ కలెక్షన్స్ తో దూసుకు పోతోంది. ఇక ఇటు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఓవర్సీస్ లో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇంటిల్లి పాదిని నవ్వుకునేలా తీశాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఈ సినిమా బిగ్ హిట్ కావడానికి ప్రధాన కారణం మ్యూజిక్ అందించడం. ఇది కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అయింది.
ఇదే బ్యానర్ ఆధ్వర్యంలో వచ్చిన చిత్రం డీజే టిల్లు. ఇది సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన మూవీ మ్యాడ్ . ఇది సూపర్ సక్సెస్. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ సైతం వాటి బాటలోనే నడుస్తోంది. బాక్సులు నింపుతున్నాయి. మొదటి రోజు రూ. 20.80 కోట్లు వసూలు చేస్తే రెండో రోజు రూ. 10 కోట్లకు పైగా వసూలు చేసింది మ్యాడ్ స్క్వేర్ . కంటెంట్ ను పూర్తిగా కామెడీ పరంగా ఉండేలా చూశాడు దర్శకుడు. ఇదే జానర్ తో త్రినాథరావు మక్కిన తీసిన మజాకా వర్కవుట్ కాలేదు. ఇక మ్యాడ్ మూడు రోజుల్లోనే ఓవర్సీస్ లో ఒక మిలియన్ క్లబ్ లో చేరడం విస్తు పోయేలా చేసింది.
Also Read : Popular Actress Rekha :వన్నె తగ్గని అందం రేఖ అద్భుతం