Maa Nanna Super Hero: సుధీర్‌ బాబు ‘మా నాన్న సూపర్‌ హీరో’ నుండి వెడ్డింగ్‌ సాంగ్‌ రిలీజ్‌ !

సుధీర్‌ బాబు ‘మా నాన్న సూపర్‌ హీరో’ నుండి వెడ్డింగ్‌ సాంగ్‌ రిలీజ్‌ !

Maa Nanna Super Hero: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌ బాబు ప్రధాన పాత్రలో లూజర్‌ వెబ్‌సిరీస్‌ ఫేమ్‌ అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మా నాన్న సూపర్‌హీరో’. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ఆర్ణ కథానాయికగా నటిస్తోంది. సాయాజీ షిండే కీలక పాత్ర పోషిస్తున్నారు. సీఏఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి వి.సెల్యులాయిడ్స్‌ పతాకంపై సునీల్‌ బలుసు ఈ సినిమానున నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి… ‘వేడుకలో’ అంటూ సాగే వెడ్డింగ్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది

Maa Nanna Super Hero Movie Updates

తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధాలకు నిజమైన అర్థాన్ని తెలియజేసేలా ‘మా నాన్న సూపర్‌ హీరో(Maa Nanna Super Hero)’ ఉంటుంది. ‘వేడుకలో..’ అంటూ సాగే ఒక సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో రాజు సుందరం ఓ కీలక పాత్రలో నటిస్తూనే, కొరియోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘హరోం హర’ సినిమా తర్వాత సుధీర్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. లూజర్‌ వెబ్‌సిరీస్‌ ఫేమ్‌ అభిలాష్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read : Devara Movie : దేవర అగ్రనటులు జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ కు అంట పారితోషికమా…

Maa Nanna Super HeroSudheer Babu
Comments (0)
Add Comment