M M Kiravani: ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లి తరువాత పలువురు పెళ్ళి పీటలెక్కుతున్నారు. దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్, రాధ కుమార్తె కార్తీక నాయర్, జబర్దస్త్ ఫేం కిరాక్ ఆర్పీ ఇప్పటికే పెళ్లి పీటలెక్కగా… దిల్ రాజు సోదరుడు కుమారుడు ఆశీష్ రెడ్డి నిశ్చితార్ధం జరిగింది. అయితే తాజాగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. దిగ్గజ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహీత ఎమ్‌ఎమ్ కీరవాణి(M M Kiravani) తనయుడు, హీరో శ్రీ సింహకు… నటుడు, నిర్మాత మురళీ మోహన్ మనుమరాలిని ఇచ్చి పెళ్లి చేయబోతున్నట్లు గత కొన్ని నెలలుగా వస్తున్న పుకార్లకు మురళీ మోహన్ క్లారిటీ ఇచ్చారు.
M M Kiravani – వియ్యం అందుకోవడం నిజమే కాని పెళ్లి మాత్రం వచ్చే ఏడాదే
కీరవాణి కుటుంబంతో వియ్యం అందుకోబోతున్నారు అని వచ్చిన వార్తలపై నటుడు, నిర్మాత మురళీ మోహన్ స్పందిస్తూ… అది వాస్తవమేనని దృవీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘నాకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కూతురు పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలైంది. ఆమెకు ఓ అమ్మాయి ఉంది… ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో ఆమె వివాహం జరగనుంది. అలాగే నా కొడుక్కి ఓ కూతురు ఉంది. ఆమె పెళ్లి కూడా దాదాపు ఖాయమైపోయింది. అందరూ ఊహించినట్లుగానే కీరవాణి(M M Kiravani) ఇంటికి కోడలిగా వెళ్లనుంది. అయితే పెద్ద మనవరాలి పెళ్లి ఫిబ్రవరిలో అయితే… చిన్న మనవరాలి పెళ్లి వచ్చే ఏడాది చివర్లో చేస్తామని’ అయన అన్నారు.
మురళీ మోహన్ మనవరాలు ఏం చేస్తుంది?
మాగంటి మురళీ మోహన్ కొడుకు రామ్ మోహన్ ఏకైక కుమార్తె పేరు ‘రాగ’. కొద్దిరోజుల క్రితం బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన రాగ… ప్రస్తుతం మాగంటి కుటుంబానికి సంబంధించి వ్యాపార సామ్రాజ్యంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. మొదటి నుంచి కూడా మురళీ మోహన్‌కు ఇండస్ట్రీలో మంచి పరిచాయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కీరవాణి అబ్బాయితో తన మనుమరాలు ‘రాగ’ను ఇచ్చి వివాహం చేయాలని భావించినట్లు తెలుస్తోంది. ఇక శ్రీసింహ విషయానికి వస్తే యమదొంగ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. మత్తు వదలరా సినిమాతో హీరోగా మారాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ సినిమాలతో టాలీవుడ్‌లో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
Also Read : Prithi Mukundan: మంచు విష్ణు ‘కన్నప్ప’లో మోడల్ ప్రీతి ముకుందన్