Zodiac signs : కార్తీక మాసంలో అదృష్ట రాశులు ఇవే!

కార్తీక మాసంలో అదృష్ట రాశులు ఇవే

Zodiac signs : కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతి పాత్రమైన మాసం. ఈ మాసంలో ప్రతీ పల్లెలో, పట్టణంలోని ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగిపోతుంటాయి. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు. అంతే కాకుండా రాత్రి సమయంలో దీపాలు వెలిగించి శివకేశవులను తలుచుకుంటారు.

అయితే ఇలాంటి పవిత్రమైన మాసంలో ఈ రాశుల( Zodiac signs ) వారికి అదృష్టం పట్టనుందంట. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Zodiac signs :

మేష రాశి : కార్తీక మాసంలో మేషరాశి పట్టిందల్లా బాగారం కానుందంట. ఎందుకంటే ఈ రాశి అధిపతి అంగారకుడు అయినందున శివుడు ఈ రాశి వారికి ప్రత్యేక దీవెనలు ఇస్తారంట. వీరు ఏ పని చేసిన కలిసి వస్తుందంట. అంతేకాకుండా అన్నిట్లో విజయం లభిస్తుందంట.

వృశ్చిక రాశి : కార్తీక మాసంలో వృశ్చిక రాశివారు పరమ శివుని నుంచి విశేషషమైన అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుకంటే ఈ రాశి అధిపతి గ్రహం కుజుడు కానున్నందున. వీరికి శివుని ఆశీర్వాదం లభిస్తుంది. దీంతో వీరికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

మకర రాశి : మకర రాశి వారికి శని దేవుడు అధిపతి. శివునికి అత్యంత ఇష్టమైన భక్తులలో శని దేవుడు ఒకరు. అందువల్ల మకర రాశి వారికి శనిదేవుడు, మహాదేవుని నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ వ్యక్తులు శివుడిని పూజించడానికి బిల్వ పత్రం, గంగా జలం, ఆవు పాలు మొదలైన వాటిని ఉపయోగించాలి. ఈ రాశి వారికి ఏ కష్టము కూడా దరిచేరనీయడు మహాశివుడు.

కుంభ రాశి : ఈ రాశికి కూడా శని దేవుడే అధిపతి. ఈ రాశి వారు కూడా శివుడు, శని దేవుడి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు. మీరు వృత్తిపరంగా విజయం సాధిస్తారు. సంపదతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ రాశి వారు ఏ పనిని తలపెట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు.

Also Read : https://hellotelugu.com/mahankali-bonalu-festival-ready/

Kartika monthLord ShivaZodiac signs
Comments (0)
Add Comment