Lucky Bhaskar : దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్(Lucky Bhaskar)’ వెంకీ అట్లూరి దర్శకుడు . క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలైన ప్రేక్షకులను అలరించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. నవంబరు 28న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చిన ‘లక్కీ భాస్కర్’ నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో ప్రథమ స్థ్థానంలో దూసుకువెళ్తోంది. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15కు పైగా దేశాల్లో టాప్ 10 ట్రెండింగ్‌లో చోటు దక్కించుకుంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టింది.
Lucky Bhaskar Movie OTT Updates
ముంబై నేపథ్యంలో సాగే కథ ఇది. భాస్కర్ (దుల్కర్ సల్మాన్) మధ్య తరగతి కుటుంబానికి చెందిన సాధారణ బ్యాంక్ ఉద్యోగి. చాలీచాలని జీతం, దానికి తోడు కుటుంబ భారమంతా ఒక్కడిపైనే ఉంటుంది. బ్యాంకు సహా దొరికిన చోటంతా అప్పులు చేస్తాడు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఉత్తమ ఉద్యోగి అనే పేరొస్తుంది తప్ప ప్రమోషన్ మాత్రం రాదు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం కోసం ఎంత రిస్క్ చేసినా తప్పు లేదనుకుంటాడు. మరి భాస్కర్ చేసిన ఆ రిస్క్ ఏమిటి? అది అతడికి ఇబ్బందుల్ని తెచ్చిపెట్టిందా లేక కష్టాల్ని దూరం చేసిందా? అనేది మిగతా కథ.
Also Read : Bougainvillea Movie : ఫహద్ ఫాజిల్ మలయాళ బ్లాక్ బస్టర్ ‘బోగన్ విల్లియా’ తెలుగులో కూడా..