Loveyapa : బాలీవుడ్ నుంచి విడుదలైన చిత్రం లవ్ యాపా. ఆశించిన దానికంటే అద్భుతంగా ఉందంటూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో స్టార్ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటించాడు. ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వచ్చేసింది. ఇందులో జునైద్ తో పాటు ఖుషీ కపూర్ నటించింది. దీనిని పూర్తిగా రొమాంటిక్ , కామెడీ ప్రధానంశంగా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు.
Loveyapa Movie Updates
సినీ వర్గాల ప్రకారం లవ్ యాపా్(Loveyapa) రూ. 8.99 కోట్ల నుండి రూ. 12 కోట్ల దాకా బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధించింది. విడుదలై రెండు నెలలు కావడంతో ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రీమియర్ అవుతోంది. చిత్ర నిర్మాతల నుండి అధికారికంగా ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. లవ్ యాపాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు.
ఈ లవ్ యాపా చిత్ర కథను తమిళనాడులో బిగ్ హిట్ అయిన చిత్రం లవ్ టుడే. ఇందులో డ్రాగన్ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ , ఇవానా నటించారు. దీనికి రీమేకే ఈ జునైద్ ఖాన్ , ఖుషీ కపూర్ లవ్ యాపా. ఈ మూవీ కథా పరంగా చూస్తే యువ జంట చుట్టూ తిరుగుతుంది. వారి రిలేషన్ పరీక్షకు గురవుతుంది. అమ్మాయి తండ్రి దాచిన రహస్యాలను వెల్లడించేందుకు ఇద్దరి ఫోన్లను మార్చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతోంది. ఇద్దరు కలుస్తారా లేక విడి పోతారా..అనే సస్పెన్స్ తో లవ్ యాపా సినిమాను తీశాడు.
Also Read : Beauty Rashmika : ఒమన్ లో నేషనల్ క్రష్ బర్త్ డే సెలబ్రేషన్స్