Love Mouli: ఓటీటీలోనికి నవదీప్‌ బోల్డ్‌ మూవీ ‘లవ్‌ మౌళి’ ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

ఓటీటీలోనికి నవదీప్‌ బోల్డ్‌ మూవీ ‘లవ్‌ మౌళి’ ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

Love Mouli: దర్శక ధీరుడు రాజమౌళి శిష్యుడు అవ‌నీంద్ర దర్శకత్వంలో నవదీప్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా లవ్‌ రొమాంటిక్‌ మూవీ ‘లవ్‌ మౌళి(Love Mouli)’. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్, సి స్పేస్ సంయుక్తంగా నిర్మించిన ఈ బోల్డ్ లవ్ స్టోరీలో పంఖురి గిద్వాని హీరోయిన్ గా నటించింది. ఛార్వీ దత్తా మరో ఫీమేల్ లీడ్ లో కనిపించింది. భళ్లాల దేవ రానా దగ్గుబాటి అతిథి పాత్రలో మెరిశాడు. ప్రేమ అనేది లేకుండా ప్రపంచంలో మనుషులకు దూరంగా బతుకుతున్న వ్యక్తికి అనూహ్యంగా ప్రేమ దొరికితే ఎలా ఉంటుంది… ఆ సమయంలో ప్రేమించే వ్యక్తి దొరికితే మనిషి ఎలా మారతాడు? అన్న కాన్సెప్ట్‌తో ‘లవ్‌ మౌళి(Love Mouli)’ని రూపొందించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యువతను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదికగా ‘ఆహా’లో జూన్‌ 27వ తేదీ నుంచిస్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా సరికొత్త పోస్టర్‌ను పంచుకుంది.

Love Mouli – కథేమిటంటే ?

చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవ‌డంతో మౌళి (న‌వ‌దీప్‌) ఒంట‌రిగా పెరుగుతాడు. మేఘాల‌య‌లోని రిసార్ట్‌లో ప్ర‌కృతి మ‌ధ్య త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా బ‌తుకుతుంటాడు. పెయిటింగ్స్‌ వేస్తూ వాటి ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌తో జీవిస్తుంటాడు. తన చిన్న‌త‌నం నుంచి చూసిన, ఎదురైన సంఘటనలు, అనుభవాల కార‌ణంగా మౌళికి ప్రేమ‌పై పెద్దగా న‌మ్మ‌కం ఉండ‌దు. అదే సమయంలో ఓ అఘోరా (రానా ద‌గ్గుబాటి) ఇచ్చిన పెయింటింగ్ బ్ర‌ష్‌తో తాను కోరుకునే ల‌క్ష‌ణాలున్న అమ్మాయిని సృష్టించే శ‌క్తి మౌళికి వ‌స్తుంది. స్వతహాగా చిత్రకారుడైన మౌళి వేసిన పెయింటింగ్ ద్వారా చిత్ర (ఫంఖూరీ గిద్వానీ) అత‌డి ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. కొన్నాళ్లు వారి ప్రేమ బంధం సాఫీగా సాగుతుంది. ఆ త‌ర్వాత‌ చిత్ర‌తో గొడ‌వ‌లు రావ‌డంతో మ‌రో పెయింటింగ్ గీస్తాడు మౌళి. మరోసారి కూడా చిత్ర‌నే అతడి ముందు ప్రత్యక్షమవుతుంది. మరి ఆ తర్వాత మౌళి, చిత్ర ఒక్క‌ట‌య్యారా? మౌళి ప్రేమకు గుడ్‌బై చెప్పడానికి కారణం ఏంటి?ప్రేమకు నిజ‌మైన అర్థాన్ని మౌళి ఎలా తెలుసుకున్నాడు? అనే అంశాన్ని దర్శకుడు చాలా ఆశక్తికరంగా, బోల్డ్ సన్నివేశాలతో తెరకెక్కించి యువతను బాగా ఆకర్షించే ప్రయత్నం చేసారు.

Also Read : Donald Sutherland: హాలీవుడ్ ప్రముఖ నటుడు మృతి ! సంతాపం తెలిపిన సమంత, కరీనా !

Love MouliNavadeep
Comments (0)
Add Comment