Lokesh Kanagaraj : సినీ వాలిలో ప్రస్తుతం తమిళ సినీ డైరెక్టర్ల హవా కొనసాగుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ రూ. 600 కోట్ల క్లబ్ లోకి చేరింది.
ఇక యంగ్ క్రియేట్ డైరెక్టర్ అట్లీ కుమార్ షారుక్ ఖాన్ తో తీసిన జవాన్ ఏకంగా ముందస్తుగానే రూ. 350 కోట్లకు పైగా వసూలు చేసింది. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్దంగా ఉంది.
Lokesh Kanagaraj Director
తాజాగా మరో దమ్మున్న డైరెక్టర్ గా పేరు పొందిన లోకేష్ కనగ రాజ్(Lokesh Kanagaraj) సూర్యతో సంతకం చేశాడు. ఆయనతో రెండు సినిమాలు చేయనున్నాడు. ఇదే విషయాన్ని కన్ ఫర్మ్ చేశాడు. సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న ఇతడి టేకింగ్ డిఫరెంట్ గా ఉంటాడు.
మార్చి 14, 1986లో తమిళనాడులోని కినాతుకడవులో పుట్టాడు. స్క్రీన్ రైటర్ గా , దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. 2015 నుంచి సినీ కెరీర్ స్టార్ట్ చేశాడు లోకేష్ కనగరాజ్. 2017లో తమిళంలో మానగరం చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
2021లో తలపతి విజయ్ తో మాస్టర్ తీశాడు. 2022లో విక్రమ్ సినిమాల ద్వారా గుర్తింపు పొందాడు. కార్తీక్ సుబ్బరాజు వల్ల తమిళ సినిమాకు పరిచయం అయ్యాడు. ఏది ఏమైనా లోకేష్ నుంచి వచ్చే సినిమాల కోసం వేచి చూడాలి.
Also Read : Anil Sharma : తారక్ ఒక్కడే ఆ పాత్ర చేయగలడు