Lokesh Kanagaraj: జూన్ లో ‘తలైవా171’ ప్రారంభం- దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ !

జూన్ లో ‘తలైవా171’ ప్రారంభం- దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ !

Lokesh Kanagaraj: ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్… ‘ఇనిమేల్‌’ మ్యూజిక్‌ ఆల్బమ్‌ తో ఇటీవల నటుడిగా మారారు. ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్‌ లిరిక్స్‌ అందించిన ఈ పాటను అతని వారసురాలు శృతిహాసన్‌ ఆలపించడంతో పాటు నటించారు. ‘ఇనిమేల్‌’ మ్యూజిక్‌ ఆల్బమ్‌ విడుదల సందర్భంగా… దర్శకుడు, నటుడు లోకేశ్‌ కనగరాజ్‌(Lokesh Kanagaraj) మీడియాతో మాట్లాడుతూ… రజనీకాంత్‌ తో తాను చేయబోయే సినిమా గురించి పలు కీలక విషయాలు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ‘ఇనిమేల్‌’ మ్యూజిక్‌ ఆల్బమ్‌ రిలీజ్ పంక్షన్ లో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Lokesh Kanagaraj Movie..

‘‘రజనీకాంత్‌తో కలసి వర్క్‌ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ‘తలైవా171’ నాకెంతో ప్రత్యేకమైనది. షూటింగ్‌ మొదలుపెట్టడానికి, ప్రీప్రొడక్షన్ వర్క్‌ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది. జూన్‌ లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. సంవత్సరంన్నరలో ఈ సినిమా పూర్తి చేసి… ఆ తర్వాత నెల రోజులకు కార్తి ‘ఖైదీ-2’ మొదలుపెడతాను. ప్రస్తుతం టి.జి.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటిస్తోన్న ‘వెట్టయాన్‌’ (తెలుగులో ‘వేటగాడు’) సినిమా విడుదల తరువాత ‘తలైవా171’ సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడిస్తాను’’ అని కనగరాజ్‌ పేర్కొన్నారు. ‘తలైవా 171’ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందించనుండగా… ఇందులో శివకార్తికేయన్‌ కీలక పాత్రలో నటించనున్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌… టి.జి.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘వెట్టయాన్‌’ లో నటిస్తున్నారు. ఇందులో అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికాసింగ్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Balakrishna : రీ రిలీజ్ కు సిద్ధమవుతున్న బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమా..

Lokesh KanagarajSuper Star Rajanikanththalaivar 171
Comments (0)
Add Comment