Lokesh Kanagaraj : ర‌జ‌నీకాంత్ తో లోకేష్ మూవీ

త‌లైవ‌ర్ 171గా పేరు ప్ర‌క‌ట‌న
Lokesh Kanagaraj :  ర‌జ‌నీకాంత్ తో లోకేష్ మూవీ

Lokesh Kanagaraj : కోలీవుడ్ – నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రిలీజ్ అయిన జైల‌ర్ దుమ్ము రేపింది. రికార్డుల మోత మోగించింది. రూ. 600 కోట్లు కొల్ల‌గొట్టింది. ర‌జ‌నీకాంత్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది స‌న్ పిక్చ‌ర్స్ . ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌దుప‌రి మూవీని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ తో తీయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

Lokesh Kanagaraj Movie With Thalaivaa

ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు సైతం ధ్రువీక‌రించారు. ర‌జ‌నీకాంత్ త‌న సినీ కెరీర్ లో ఈ తీయ‌బోయే చిత్రం 171ది కావ‌డం విశేషం. ఈ కొత్త ప్రాజెక్టుకు లోకేష్ క‌న‌గ‌రాజ్(Lokesh Kanagaraj) ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ చిత్రానికి ఎప్ప‌టి లాగే రాక్ స్టార్ గా పేరు పొందిన అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించ‌నున్న‌ట్లు స‌న్ పిక్చ‌ర్స్ స్ప‌ష్టం చేసింది.

ఇదిలా ఉండ‌గా అతి త‌క్కువ స‌మ‌యంలో భార‌తీయ చిత్ర సీమ‌లో అత్యంత డిమాండ్ ఉన్న ద‌ర్శ‌కుల‌లో ఒక‌రిగా ఉన్నారు లోకేష్ క‌న‌గ‌రాజ్ ఉన్నారు. ఆయ‌న క‌థా నైపుణ్యం మాస్ ను ఆక‌ట్టుకునేలా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో తీయ‌బోయే సినిమాను వ‌చ్చే ఏడాది 2024 లో దీపావ‌ళికి విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Also Read : Shruti Haasan Vs Ruhani Sharma

Comments (0)
Add Comment