Lokesh Kanagaraj : రజనీకాంత్ ఆరోగ్యం పై జైలర్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

ఈ విషయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ....

Lokesh Kanagaraj : సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకున్న ఆయన గురువారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా, రజనీకాంత్ ఆరోగ్యం విషయంలో ‘కూలీ’ చిత్ర బృందాన్ని తప్పుబడుతూ పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిని ఉద్దేశించి చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) స్పందించారు. ఆయా వార్తల్లో నిజం లేదని.. అలాంటి ప్రచారాలు చూస్తుంటే ఎంతో బాధగా ఉందని అన్నారు.

Lokesh Kanagaraj Comment

ఈ విషయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ.. సూపర్ స్టార్ రజనీకాంత్‌గారి అనారోగ్యం విషయంలో ‘కూలీ’ టీమ్‌పై వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. దాదాపు నెల రోజుల క్రితం వైజాగ్ షెడ్యూల్‌లో తన ఆరోగ్యం గురించి రజనీకాంత్ మాతో చెప్పారు. తానొక సర్జరీ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే మేము సెప్టెంబర్ 28 నాటికి ఆయనకు సంబంధించిన ముఖ్యమైన షూటింగ్ పోర్షన్ మొత్తం పూర్తి చేశాం. 30వ తేదీన ఆయన ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం కంటే మాకు షూటింగ్ ముఖ్యం కాదు. కాబట్టి ఏదైనా విషయంపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ఇలాంటి వార్తలు రాయాలని కోరుతున్నానంటూ లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) చెప్పారు. అక్టోబర్ 15 తర్వాత రజనీకాంత్ తిరిగి ‘కూలీ’ సెట్లోకి అడుగుపెడతారని లోకేశ్ తెలిపారు.

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా.. ప్రస్తుతం తన LCU నుండి వరుస బ్లాక్‌బస్టర్‌లతో అదరగొడుతున్న సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. ఇది రజినీకాంత్ కి 171 మూవీ. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా టైటిల్ రివీల్ టీజర్‌కు మ్యాసీవ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శృతి హాసన్, మహేంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : Kanguva Movie : కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా హిట్ కొట్టాలని తహతహలాడుతున్న సూర్య

CommentsLokesh KanagarajSuper Star RajinikanthViral
Comments (0)
Add Comment