Leo Movie Record : రిలీజ్ కాకుండానే రికార్డుల మోత‌

ద‌ళ‌ప‌తి విజ‌యా మ‌జాకా

త‌మిళ సినీ సూప‌ర్ స్టార్ త‌ళ‌ప‌తి విజ‌య్ , త్రిష కృష్ణ‌న్ క‌లిసి న‌టించిన లియో రికార్డుల మోత మోగిస్తోంది. ఇంకా రిలీజ్ కాకుండానే వ‌సూళ్ల సునామీ సృష్టించ‌డం విస్తు పోయేలా చేస్తోంది. గ‌తంలో లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ట‌ర్ సినిమాలో న‌టించాడు జోసెఫ్ విజ‌య్. త‌ను పూజా హెగ్డేతో క‌లిసి న‌టించిన బీస్ట్ ఆశించిన మేర రాణించ లేదు. దీంతో అక్టోబ‌ర్ 19న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న లియో మూవీపైనే ఆశ‌లు పెట్టుకున్నాడు.

ఇదే స‌మ‌యంలో త‌ను తీసిన మూవీ వ‌సూళ్ల సునామీ సృష్టించాల‌ని కోరుకుంటూ ఏకంగా న‌డుచుకుంటూ తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్నాడు ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్. ఈ మ‌ధ్య‌న త‌మిళ సినిమాను యువ డైరెక్ట‌ర్లు కొత్త పుంత‌లు తొక్కిస్తున్నారు. మ‌రో వైపు త‌మిళ‌నాడు స‌ర్కార్ రిలీజ్ చేసేందుకు గాను ముంద‌స్తు టికెట్లు ఇచ్చేందుకు వీలు కుద‌ర‌దంటూ పేర్కొంది. దీనిపై మూవీ మేక‌ర్స్ కోర్టుకు వెళ్లారు. ఇంకా కోర్టు తీర్పు ఇవ్వ‌లేదు.

ఇదే స‌మ‌యంలో ముంద‌స్తు టికెట్ల బుకింగ్ మాత్రం దుమ్ము రేపుతోంది. ప్ర‌తి చోటా క‌లెక్ష‌న్లు ఆశించిన స్థాయి కంటే ఎక్కువ‌గా వ‌స్తుండ‌డంతో ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఫుల్ ఖుషీలో ఉన్నారు. తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తంగా ముంద‌స్తు టికెట్ల క‌లెక్ష‌న్ల‌లో ఆల్ టైమ్ రికార్డు న‌మోదు చేసింది లియో మూవీ.

Comments (0)
Add Comment