Leo Movie : ఐదురోజుల ముందే విడుదల కానున్న లియో

ఓటీటీలో ఐదురోజుల ముందే విడుదల కానున్న లియో

ఓటీటీలో ఐదురోజుల ముందే విడుదల కానున్న లియో

Leo Movie : తలపథి విజయ్ హీరోగా.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా లియో. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్‌ టాక్ వచ్చిన వసూళ్ల పరంగా సత్తా చాటింది. విజయ్ కెరీర్‌ లో మాత్రమే కాదు కోలీవుడ్ హిస్టరీ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా లియో(Leo Movie) చరిత్ర సృష్టించింది. థియేటర్లలో సూపర్ హిట్టయిన లియో సినిమా ఓటీటీ రిలీజ్ కోసం కూడా చాలామంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

దీనికి కారణం థియేట్రికల్ వెర్షన్ కు కాస్త భిన్నంగా ఓటీటీ వెర్షన్ ఉండడమే కాకుండా సినిమాతో సంబంధం లేకుండా, ఓటీటీ వెర్షన్ లో 18 నిమిషాల పాటు కొత్త సన్నివేశాలు ఉండబోతున్నాయనే విషయాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రకటించడం. దీనితో నెట్ ఫ్లిక్స్ ఓటిటి ఫ్లాట్ ఫాం సబ్ స్క్రైబర్స్ లియో రిలీజ్ కోసం ఆశక్తి గా ఎదురుచూస్తున్నారు. లియో నిర్మాణ సంస్థతో నెట్ ఫ్లిక్స్ ఒప్పందం ప్రకారం ఈ సినిమాను నవంబరు 21న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం ప్రకటించింది.

Leo Movie – ఐదు రోజుల ముందే రిలీజ్ కు సన్నాహాలు

ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో లియో హంగామా దాదాపు ముగిసింది. తమిళనాడుతో పాటు ఓవర్సీస్ లో ఈ సినిమాకు ఆక్యుపెన్సీ తగ్గింది. ఇప్పటికే ఇది తమిళనాట వంద కోట్ల రూపాయల షేర్ సాధించి రికార్డ్ సృష్టించింది. ఇలా సినిమాపై చర్చ సాగుతుండగానే ఓటీటీలోకి తీసుకురావాలనేది నెట్ ఫ్లిక్స్ ప్లాన్. రీసెంట్ గా జవాన్ కు సంబంధించి అదనంగా కొన్ని సన్నివేశాల్ని జత చేసింది నెట్ ఫ్లిక్స్. దానికి దేశవ్యాప్తంగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ స్పందన చూసిన సదరు కంపెనీ, లియోను ముందుగానే స్ట్రీమింగ్ కు తీసుకురావాలనుకుంటోంది.

వీలైతే అదనంగా కొంత మొత్తాన్ని నిర్మాతకు ఇవ్వడానికి కూడా రెడీ అయిందని సమాచారం. దీనితో ఈ సినిమాను చెప్పిన టైమ్ కంటే కాస్త ముందుగానే ఓటీటీలో రిలీజ్ చేయడానికి నెట్ ఫ్లిక్స్ యాజమాన్య ప్రయత్నాలు చేస్తుంది. లెక్కప్రకారం, ఈ సినిమా నవంబర్ 21న స్ట్రీమింగ్ కు రావాల్సి ఉన్నా 16వ తేదీకే ఓటీటీలోకి తీసుకొచ్చే విదంగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. త్వరలోనే లియో ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా బయటకు రానుంది.

Also Read : Jigarthanda Double X: తమిళ డైరెక్టర్ పై వెంకీ ప్రశంసల వర్షం

LEOlokesh kanakrajVijay
Comments (0)
Add Comment