Leo Advance Booking : యుకెలో త‌ళ‌ప‌తి లియో రికార్డ్

త‌ళ‌ప‌తి జోసెఫ్ విజ‌య్ కిర్రాక్

త‌మిళ సినీ రంగానికి చెందిన మోస్ట్ పాపుల‌ర్ హీరో త‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన లియో చిత్రం డేట్ ఫిక్స్ అయ్యింది. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించి విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్ , సాంగ్ , టీజ‌ర్ , ట్రైల‌ర్ మ‌రింత ఆస‌క్తిని రేపుతున్నాయి.

ప్ర‌ధానంగా ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ త‌న‌దైన ముద్ర‌ను క‌న‌బ‌రుస్తున్నాడు. రోజు రోజుకు అంచ‌నాలు పెంచేలా పోస్ట‌ర్స్ ను రూపొందించాడు. ఇక ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగి పోయే ఏకైక న‌టుడు త‌ళ‌ప‌తి విజ‌య్.

ఇండియాతో పాటు ఓవ‌ర్సీస్ లో సైతం లియో మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాకు అందించిన మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంది. ప్ర‌త్యేకించి అనిరుధ్ ర‌విచంద‌ర్ ఇచ్చిన బీజీఎం చిత్రానికి హైలెట్ గా మారింది.

తాజాగా యుఎస్ఏతో పాటు యునైటెడ్ కింగ్ డ‌మ్ లో అడ్వాన్స్ బుకింగ్ లో రికార్డ్ బ్రేక్ చేసింది. ఇప్ప‌టికే అన్ని టికెట్లు పూర్త‌యి పోయిన‌ట్లు స‌మాచారం. దీంతో ఇంకా రిలీజ్ కాకుండా రికార్డుల మోత మోగిస్తున్న లియో విడుద‌ల‌య్యాక ఇంకెన్ని కోట్లు కుమ్మ‌రిస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా త‌న మార్కెట్ కు ఢోకా లేద‌ని నిరూపిచాడు జోసెఫ్ విజ‌య్.

Comments (0)
Add Comment