Jayachandran Death : ప్ర‌ముఖ గాయ‌కుడు జ‌య‌చంద్ర‌న్ క‌న్నుమూత

సినిమా ప‌రిశ్ర‌మ‌లో అలుముకున్న విషాదం

Jayachandran : ప్ర‌ముఖ సినీ నేప‌థ్య గాయ‌కుడు పి. జ‌య‌చంద్ర‌న్(Jayachandran) క‌న్నుమూశారు. ఆయ‌న త‌న కెరీర్ లో 16 వేల‌కు పైగా వివిధ భాష‌ల‌లో పాట‌లు పాడారు. మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళం, త‌దిత‌ర భాష‌ల‌లో జ‌నాద‌ర‌ణ పొందిన గీతాలు ఆలాపించారు.

Singer Jayachandran No More..

రోజావే చిన్ని రోజావే, అన‌గ‌న‌గా ఆకాశం ఉంది అన్న పాట‌లు తెలుగు వారిని మ‌రింత ఆక‌ట్టుకునేలా చేశాయి. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా జ‌య‌చంద్ర‌న్ క్యాన్స‌ర్ వ్యాధితో బాధ ప‌డుతున్నారు. ఆయ‌న మృతితో సినీ రంగం ఒక్క‌సారిగా విషాదానికి లోనైంది. సంగీత అభిమానులు, సినీ ప్ర‌ముఖులు తీవ్ర ఆవేద‌న చెందారు.

లెజండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ ఇళ‌య‌రాజా, అల్లా ర‌ఖా రెహ‌మాన్ , ఎంఎం కీర‌వాణి, కోటి, విద్యా సాగ‌ర్ , త‌దిత‌రుల‌తో క‌లిసి ప‌ని చేశారు. అద్భుత‌మైన పాట‌ల‌కు ప్రాణం పోశారు పి. జ‌య‌చంద్ర‌న్. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన సుస్వాగ‌తం సినిమాలో ఆయ‌న పాడిన హ్యాపీ హ్యాపీ బ‌ర్త్ డేలు పాట సూప‌ర్ హిట్ గా నిలిచింది. తెలుగులో ఆయ‌న పాడిన పాట నా చెల్లి చంద్ర‌మ్మ‌. ఈ సాంగ్ ఊరు మ‌న‌దిరాలో ఉంది.

శివ శంక‌రా స‌ర్వ శ‌ర‌ణ్య విభో అన్న పాట అత్యంత పాపుల‌ర్ సాంగ్ గా నిలిచింది. 1986 సంవ‌త్స‌రంలో పి. జ‌య‌చంద్ర‌న్ కు ఈ పాట‌కు గాను జాతీయ పుర‌స్కారం ద‌క్కింది. కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాలు ఆయ‌న‌కు అవార్డులు అందించాయి. పి. జ‌య‌చంద్ర‌న్ లేర‌న్న వార్త త‌న‌ను మ‌రింత దిగ్భ్రాంతికి గురి చేసింద‌న్నారు రెహ‌మాన్, ఇళ‌య‌రాజా.

Also Read : Hero Pawan Kalyan : టీటీడీ నిర్వాకం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆగ్ర‌హం

ActorBreakingNO MoreSingerUpdatesViral
Comments (0)
Add Comment