Indian 2: స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఇండియన్ 2’(తెలుగులో భారతీయుడు 2). సమకాలీన సామాజిక సమస్య లంచం ఇతివృత్తంగా సరిగ్గా 27 ఏళ్ళ క్రితం శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు)కు సీక్వెల్ గా ఈ సినిమాను తెరెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో కాజల్ కథానాయిక. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 12 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్.
Indian 2 Updates
అవినీతిపరులపై, అన్యాయంపై యుద్ధం చేసే సేనాపతిగా కమల్‌ను మరోసారి వెండితెరపై దర్శకుడు శంకర్ చూపించనున్నాడు. అయితే తాజాగా ‘ఇండియన్ 2’ చిత్రానికి విడుదల విషయంలో చిక్కులు ఏర్పడేలా కనిపిస్తున్నాయి. భారతీయుడు సినిమాలో అవినీతిపరులను అంతం చేసేందుకు కమల్ హాసన్ తన రెండు వేళ్ల సాయంతో శత్రువుల మెడ భాగంపై సింపుల్‌గా నొక్కి హతమారుస్తాడు . ఇండియన్ సినిమా కోసం వర్మక్కలై అనే విద్యకు సంబంధించిన కొన్ని ట్రిక్స్‌ను కమల్ నేర్చుకున్నారు. 1996 సమయంలోనే ఆ విద్యను రాజేంద్రన్ అనే వ్యక్తి నుంచి కమల్ నేర్చుకున్నారు.
అయితే ఇప్పుడు ‘ఇండియన్ 2(Indian 2)’ సినిమా కోసం తను నేర్పించిన విద్యనే వెండితెరపై చూపించబోతున్నారని, అందుకు సంబంధించి తన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని మదురై జిల్లా న్యాయస్థానంలో కాపీరైట్ కేసును రాజేంద్రన్ వేశారు. ‘ఇండియన్ 2’ సినిమా విడుదలపై నిషేధం విధించాలని కోర్టును కోరారు. ‘ 1996 భారతీయుడు సినిమా సెట్ లో కమల్‌హాసన్ కు వర్మక్కలై విద్యకు సంబంధించి కొన్ని ముద్రలు నేర్పించాను. కొన్ని ఫైట్ సీన్స్‌కు అవసరమైన విద్యను నా నుంచే నేర్చుకున్నారు. వర్మక్కలై కళలోని శాస్త్రీయ పద్ధతులను చిత్ర దర్శకుడు శంకర్ తో పాటు రచయిత సుజాతకు వివరించాను. అలా ఇండియన్ సినిమాలో పనిచేసిన వ్యక్తుల జాబితాలో నా పేరు కూడా ఉంది. అని రాజేంద్రన్ తన పిటీషన్‌లో పేర్కొన్నారు..
ఈ సందర్భంలో ‘ఇండియన్ 2(Indian 2)’ సినిమా త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ప్రోమోలలో నేను కమల్ హాసన్‌కి శిక్షణ ఇచ్చిన వర్మ ముద్రలను మళ్లీ ఉపయోగించారు. కానీ సినిమా టైటిల్ కార్డ్‌లో నా పేరు లేదు. ఇండియన్ సినిమా కోసం నా నుంచి ట్రైనింగ్ తీసుకున్న వర్మ ముద్రలనే ఇండియన్-2 సినిమాలో కూడా వాడారు కాబట్టి ఈ సినిమాలో కూడా నా పేరు ఎందుకు వేయలేదు. కాబట్టి ఈ సినిమా విడుదలను నిషేధించాలి.’ అని పిటిషన్‌లో రాజేంద్రన్ పేర్కొన్నారు.
ఈ కేసు మదురై జిల్లా న్యాయమూర్తి సెల్వ మహేశ్వరి ఎదుట విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఇండియన్ 2(Indian 2) నిర్మాత సుభాస్కరణ్, దర్శకుడు శంకర్, నటుడు కమల్ హాసన్‌లకు కాపీరైట్ నోటీసులు పంపాలని ఆదేశిస్తూ విచారణను జూలై 9కి వాయిదా వేశారు. దీనితో జూలై 12న ‘ఇండియన్ 2’ సినిమా విడుదలపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : Devoleena Bhattacharjee: ప్రెగ్నెన్సీ రూమర్స్ పై స్పందించిన బుల్లితెర నటి దేవలీన !