Leesha Eclairs: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు వీరాభిమానిగా తొలుత మోడలింగ్ లో అడుగుపెట్టి ఆ తరువాత సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చెన్నై బ్యూటీ లీషా ఎక్లైర్స్. అలా అలా తమ అభిమానంతో షారూక్ ఖాన్ ‘జవాన్’ సినిమాలో విలన్ విజయ్ సేతుపతి పిఏగా చాలా చిన్న పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది.
Leesha Eclairs Viral
ప్రస్తుతం ఈ చెన్నై బ్యూటీ బిగ్ బాస్ తెలుగు సీజన్-2 విన్నర్ కౌశల్ తో కలిసి తెలుగులో ‘రైట్’ అనే సినిమాలో నటించింది. దాదాపు రెండేళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ సినిమా… తాజాగా థియేటర్లలోకి వచ్చిన సందర్భంగా చెన్నై బ్యూటీ లీషా ఎక్లైర్స్(Leesha Eclairs) తన ఆనందాన్ని పంచుకుంది. ‘రైట్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా షారూక్ ఖాన్ అభిమాని నుండి… హీరోయిన్ గా అంచలంచెలుగా ఎదిగిన తన సినీ ప్రస్థానం గురించి ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం లీషా చెప్పిన పలు విషయాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. షారుక్ అభిమానిగా సినీ రంగంలో అడుగుపెట్టిన తాను.. ఇప్పుడు హీరోయిన్‌గా సినిమాలు చేస్తుండటం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది.
Also Read : Actress Sai Pallavi: ‘తండేల్’ బోటులో సాయిపల్లవి !