Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి… తన భర్త వరుణ్ తేజ్ తో కలసి వేకేషన్ నుంచి ఇటీవలే తిరిగొచ్చింది. పెళ్లి తరువాత వరుణ్ తేజ్ తో తొలిసారి వెకేషన్ కు వెళ్లిన లావణ్య… ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది. లావణ్య పెళ్లి తర్వాత ఆమె నటించిన మిస్ ఫర్‌ఫెక్ట్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లావణ్య… తాజాగా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Lavanya Tripathi Started…
జిమ్ లో తన వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియోను లావణ్య తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అత్యంత కఠినమైన సాధన చేస్తూ వీడియోలో ఆమె కనిపించింది. ఈ వీడియోను చూసిన పలువురు లావణ్య(Lavanya Tripathi) సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లావణ్య తన ఇన్‌స్టాలో రాస్తూ… ‘నాలుగు నెలల తర్వాత జిమ్‌కు వచ్చా. మునుపటిలా మళ్లీ సాధన చేయడానికి నాలుగు రోజులు పట్టింది. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పుడైతే మొత్తానికి మళ్లీ నా దారిలోకి వచ్చా’ అంటూ రాసుకొచ్చింది.
దాదాపు ఏడేళ్ల క్రితం లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో ‘మాయావన్’ చిత్రం ‘ప్రాజెక్ట్ z’ రిలీజ్ కానుంది. ఈ సినిమా ఏప్రిల్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. 2017లో తమిళంలో విడుదలైన ఏడేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో విడుదల చేయడం ఏంటి అని సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
Also Read : Hero Suriya: ముకుటేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న సూర్య !